BIG BREAKING : ఢిల్లీలో రాత్రి భారీ ఎన్‌కౌంటర్ .. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం

ఈ ఎన్‌కౌంటర్ లో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. దేశ రాజధానిలో ఈ ముఠా కదలికల గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.

New Update
BREAKING

BREAKING

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. దేశ రాజధానిలో ఈ ముఠా కదలికల గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.  రాత్రి 2:20 గంటల ప్రాంతంలో పోలీసులు,గ్యాంగ్‌స్టర్లకు మధ్య  భీకర  కాల్పులు జరిగాయి.  ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్లు  రంజన్ పాఠక్ (25), బిమ్లేష్ మహ్తో అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25),మనీష్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21)గా గుర్తించారు. వీరంతా బీహార్ ఎన్నికలకు ముందు అక్కడ అలజడి సృష్టించేందుకు  కుట్రలు పన్నిన్నట్లు సమాచారం.

రెండు రాష్ట్రాల పోలీసులు నిఘా

హతమైన గ్యాంగ్‌స్టర్లను వెంటనే రోహిణిలోని డాక్టర్ బిఎస్‌ఎ ఆసుపత్రికి తరలించారు.  పోలీసుల ప్రకారం.. ఈ ముఠా బీహార్,  నేపాల్‌లో అనేక తీవ్రమైన నేర సంఘటనలకు పాల్పడింది. ఢిల్లీ,  బీహార్ పోలీసులు చాలా కాలంగా ఈ ముఠా కోసం వెతుకుతున్నారు. అనేక తీవ్రమైన కేసుల్లో వాంటెడ్ గా ఉన్న ఈ ముఠాపై రెండు రాష్ట్రాల పోలీసులు నిఘా పెట్టారు. చివరకు, ఖచ్చితమైన నిఘాతో  ఈ ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. 

Advertisment
తాజా కథనాలు