Bihar results: సారీ నితీష్ జీ.. ఈసారి బీహార్ సీఎం BJP లీడరే!

బిహార్‌లో NDAని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు కూడా బాగా పని చేశారు. దీంతో ఈసారి సీఎం కుర్చీ కమలం పువ్వు నాయకులే కావాలని పట్టుబట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. పవర్ ఫుల్ లీడర్లు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఇద్దరిలో ఎవరో ఒకరు సీఎం కావచ్చు.

New Update
Bihar next CM from BJP

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ కూటమి విజయం ఖరారైంది. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 200 స్థానాల్లో ఎడ్జీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మరోసారి నితీశ్ కుమార్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది పదో సారి అవుతోంది. 2005 నవంబర్ 24 నుంచి 2025 వరకు 20ఏళ్లకు పైగా ఆయన సీఎం కూర్చీలో కూర్చున్నాడు.

నితీష్ వయసు, ముఖ్యమంత్రి బాధ్యతల ఒత్తిడి దృష్యా ఆయన ఈసారి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిహార్‌లో ఎడ్డీయేని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు కూడా బాగా పని చేశారు. దీంతో ఈసారి సీఎం కుర్చీ కమలం పువ్వు నాయకులే కావాలని పట్టుబట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని బిహార్ ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయ్ కుమార్ సిన్హా కూడా సీఎం రేసులో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆయన బిహార్ మంత్రివర్గంలో ఉన్నారు.

అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బిహార్‌లో బీజేపీ నాయకుల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదని అనుకుంటున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం 95 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 84 సీట్లలో నితీష్ బలపరిచిన జేడీయూ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. 

మహారాష్ట్ర సీన్ రిపీట్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ముందుగా ముఖ్యమంత్రిని ప్రకటించలేదు. మెజార్టీ సీట్లు వచ్చాక పొత్తులొ భాగమైన శివసేనా అభ్యర్థి షిండేని కాకుండా బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌కి అవకాశం ఇచ్చారు. బిహార్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు భారీగా ఉన్నాయి. బీజేపీ నుంచి పవర్ ఫుల్ లీడర్లుగా ఉన్న సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఇద్దరిలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని చేయవచ్చు. 

Advertisment
తాజా కథనాలు