/rtv/media/media_files/2025/10/13/bangalore-bus-accident-2025-10-13-13-10-48.jpg)
Bangalore bus accident
Heart Attack: ఈ మధ్య సడెన్ హార్ట్ ఎటాక్స్ తో మరణిస్తున్నఘటనలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు బలవుతున్నారు. డాన్స్ చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ, గేమ్స్ ఆడుకుంటూ ఇలా ఎక్కడిక్కడే జనాలు కుప్పకూలుతున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నడిరోడ్డుపై జరిగిన ఓ ఘటన మరింత భయాన్ని పెంచుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఒక బస్సు డ్రైవర్ బస్సు నడుపుతుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో బస్సు నియంత్రణ కోల్పోయి ముందున్న వాహనాలను బలంగా ఢీకొట్టింది. కండక్టర్ బస్సును అదుపుచేసే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే ప్రమాదం జరిగిపోయింది.
🚨Bengaluru, Karnataka: Yesterday, near Chinnaswamy Stadium, a bus driver suffered a heart attack and lost control of the bus, crashing into 9 vehicles. The entire incident was captured in the bus’s CCTV. pic.twitter.com/5ptRSoHgtG
— Deadly Kalesh (@Deadlykalesh) October 12, 2025
తొమ్మిది వాహనాలు నుజ్జు నుజ్జు..
ఈ ప్రమాదంలో సుమారు తొమ్మిది వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనాల ముందు భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. అంతే కాదు ఒక ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబందించిన దృశ్యాలు బస్సులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇవి కాస్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి గురైన డ్రైవర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Follow Us