Delhi: కాలుష్యం ఎఫెక్ట్..స్కూళ్ళు బంద్

దీపావళి తర్వాత ఢిల్లీలో విపరీతంగా కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీంతో అక్కడ ప్రాథమిక స్కూళ్ళ తరగతులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో ఈరోజు నుంచి స్టేజ్‌-3 ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. 

New Update
air

Delhi Air Polution: 

దేశ రాజధానిలో వాయకాలుష్యం స్థాయిలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వరుసగా రెండో కూడా రోజు వాయునాణ్యత సూచీ దాదాపు 400 దాటింది. దీన్ని ఎలా అయినా కట్టడి చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో స్టేజ్–3 ని  అమలు చేస్తున్నట్లు ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ (CAQM) ప్రకటించింది. ఈరోజు నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి. స్టే–3లో నిర్మాణాలు, కూల్చివేతలు చేయకూడదు. దాంతో పాటూ ఐదో తరగతి విద్యార్థులకు సెలవు ఉంటుంది. వీరికి ఆన్‌లైన్‌ లో క్లాసులు నిర్వహిస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ చెప్పారు. 

 వాయు నాణ్యత సూచి 400 దాడంలో నిన్న, ఇవాళ సమీపంలోని దృశ్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ పొగమంచు ఎఫెక్ట్‌ విమానాలపై కూడా పడింది. దాదాపు 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఈ మేరకు ఫ్లైట్‌రాడర్ 24 సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీకి రావాల్సిన 115 విమానాలు, అక్కడి నుంచి బయలుదేరాల్సిన 226 సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు చెప్పింది. మరోవైపు ఢిల్లీ కాలుష్యంపై మంత్రి గోపాల్‌రాయ్ స్పందించారు. '' ఈ సీజన్‌లో తొలిసారి రెండు రోజులుగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400లకు పైగా ఉంది. అక్టోబర్ 14 నుంచి 400 కన్నా తక్కువగా ఉన్న ఈ సూచి ఒక్కసారిగా ఎలా పెరిగింది అనే దానిపై అందరికీ సందేహాలు నెలకొన్నాయి. పర్వతాల వద్ద మంచు కురుస్తుండటం వల్ల ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. అందుకే ప్రస్తుతం నార్త్ ఇండియాలో పొడి వాతావరణం ఉంది. రేపటినుంచి కాలుష్య స్థాయిలు తగ్గే ఛాన్స్ ఉంది. 

Also Read: Hockey: హ్యాట్రిక్ కొట్టారు..మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ..

Advertisment
Advertisment
తాజా కథనాలు