ఇండియాలో అమ్మే బిస్కెట్ ప్యాకెట్లో పాకిస్తాన్ జెండా.. ఇంటెలిజెన్స్ అలర్ట్

రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ జెండాలు కలకలం రేపాయి. బికనీర్ జిల్లాలోని సరిహద్దు గ్రామాలలో బిస్కెట్ ప్యాకెట్లో పాకిస్థాన్ జెండా ముద్రించిన బెలూన్లు బయటపడటం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. దీంతో భద్రతా, గూఢచార సంస్థలు అప్రమత్తమయ్యాయి.

New Update
Pakistani flag

రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ జెండాలు కలకలం రేపాయి. బికనీర్ జిల్లాలోని సరిహద్దు గ్రామాలలో బిస్కెట్ ప్యాకెట్లో పాకిస్థాన్ జెండా ముద్రించిన బెలూన్లు బయటపడటం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ సంఘటన నేపథ్యంలో భద్రతా, గూఢచార సంస్థలు అప్రమత్తమయ్యాయి. బిస్కెట్ ప్యాకెట్లలో సాధారణంగా పిల్లలు ఆడుకునే చిన్నపాటి బహుమతులు (టాయ్స్) ఉంటాయి. అయితే, తాజాగా కొన్ని బిస్కెట్ ప్యాకెట్లలో చిన్నపాటి బెలూన్లు బయటపడగా, వాటిపై పాకిస్థాన్ జాతీయ జెండా ప్రింట్ చేసి ఉంది. అలాగే ఉర్దూలో కొన్ని సందేశాలు ఉన్నట్లు గుర్తించారు. సరిహద్దు ప్రాంత ప్రజలు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు, BSF అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, గూఢచార సంస్థల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ బెలూన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బెలూన్లు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉండవచ్చనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దుకు ఆనుకుని ఉండటంతో, ఇవి సరిహద్దు దాటి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. గతంలో కూడా పాకిస్థాన్ జెండాలు, 'ఐ లవ్ పాకిస్తాన్' వంటి సందేశాలు ఉన్న బెలూన్లు సరిహద్దు గ్రామాల్లో లభ్యమైన సంఘటనలు ఉన్నాయి.

ప్రస్తుతం, స్థానిక పోలీసులు, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బెలూన్లలో మరేదైనా రహస్య పరికరం ఉందా లేదా ఏదైనా గూఢచార కుట్ర ఉందా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు ఏవైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని భద్రతా ఏజెన్సీలు కోరాయి. సరిహద్దు వెంబడి గస్తీని కూడా పెంచారు. ఈ సంఘటనతో సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు