IRCTC:ఐఆర్సీటీసీలో కీలక మార్పు..అడ్వాన్స్ బుకింగ్స్ 60 రోజులకు కుదింపు

ట్రైన్ టికెట్ బుకింగ్స్‌లో కీలక మార్పులు చేసింది రైల్వేశాఖ. ఇంతకు ముందు 120 రోజులు ముందుగానే ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఇప్పుడు 60 రోజులకు కుదించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. 

Train
New Update

Advance Tarin Ticket Booking: 

టికెట్ రిజర్వేషన్‌లో చాలాపెద్ద మార్పును చేసింది భారతీయ రైల్వే. ఐఆర్సీటీసీ నిబంధనల్లో అతి ముఖ్యమైన దాన్ని మార్చింది. ప్రస్తుతం రైలు ప్రయాణానికి 120 రోజుల ముందుగానే బుకింగ్‌ చేసుకునే సదుపాయం ఉండగా.. దానిని 60 రోజులకు కుదించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. అయితే ఇప్పటికే బుకింగ్ చేసుకున్నవారికి మాత్రం ఈమార్పు వర్తించదు. దాంతో పాటూ తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌, గోమతి ఎక్స్‌ప్రెస్‌ లాంటి రైళ్ళల్లో ఇప్పటికే తక్కువ బుకింగ్ వ్యవధి ఉన్న కారణంగా అవి యథాతథంగానే ఉంటాయి. అలాగే విదేశీ పర్యాకులకు కూడా ఈ కొత్త ఊల్ వర్తించదు. వారు  మాత్రం ఎప్పటిలానే 365 రోజుల ముందుగానే టికెట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చును.

ఇది కూడా చదవండి: TGPSC GROUP-1: గ్రూప్-1 మెయిన్స్ పై సీఎస్ కీలక ఆదేశాలు!

కొన్ని రోజుల క్రితమే ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్స్ కోసం మరో కొత్త అవకాశాన్ని కూడా కల్పించింది. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని మరింత సులభతరం చేయనుంది. ఈ సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే రైల్వే టికెట్లను కేవలం ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే రైల్వే టికెట్ల బుకింగ్ కోసం IRCTC, NPCI, కో రోవర్ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో UPI వాయిస్ ఓవర్ చెల్లింపుల సేవలను ప్రారంభించాయి. పేమెంట్ గేట్‌వేతో అనుసంధానం చేయబడిన ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో ఐఆర్సీటీసీలో రైలు టికెట్ల కోసం వాయిస్ ఓవర్ ఉపయోగించి లేదా కాల్‌లో యూపీఐ ఐడీ లేదా మొబైల్ నెంబర్ టైప్ చేయడం ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. అంతేకాదు AI వర్చువల్ అసిస్టెంట్ ఆస్క్ దిశా ద్వారా భారతీయ రైల్వే సర్వీసులన్నీ పొందొచ్చు. ఇందులో టికెట్లు బుక్ చేయడమే కాదు.. పేమెంట్స్ కూడా నేరుగా చేయగలుగుతారు. అయితే ఈ రూల్ ఇంకా అమల్లోకి రాలేదు. ఎప్పటి నుంచి వస్తుందో రైల్వేశాఖ ఇంకా ప్రకటించలేదు.  

ఇది కూడా చదవండి:'విశ్వం' సక్సెస్ కోసం కావ్య థాపర్ ఇలా చేసిందంటే నమ్ముతారా!

ఇది కూడా చదవండి:Telangana: తెలంగాణలో మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ !

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe