ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యాక్సెంచర్.. కంపెనీలో అసలేం జరుగుతోంది?

యాక్సెంచర్ కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ప్రమోషన్లతో పాటు వేతన పెంపును ఆరు నెలల పాటు ఆలస్యం చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

author-image
By Vishnu Nagula
New Update
Accenture

Accenture: ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. పదోన్నతులు, వేతన పెంపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా యాక్సెంచర్ కంపెనీ డిసెంబర్‌లో ప్రమోషన్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ డిసెంబర్లో ప్రమోషన్లు ఇవ్వకుండా.. వచ్చే జూన్లో ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో  ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ ఉద్యోగుల్లో నిరాశ వ్యక్తం అవుతోంది. ఇలా చేయడం సరికాదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగులకు ప్రమోషన్ ఆలస్యం చేయడానికి ముఖ్య కారణం క్లయింట్లు ఖర్చు, ఆర్ధిక ఇబ్బందులు, కంపెనీ వ్యయం అని తెలుస్తోంది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే క్లయింట్ల డిమాండ్స్ కూడా ప్రమోషన్లు ఆలస్యం కావడానికి మరో కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం యాక్సెంచర్ కంపెనీ షేర్ వాల్యూ కూడా గణనీయంగా పడిపోయింది. ఈ పరిణామాలు ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ కంపెనీకి మొత్తం 120 దేశాల్లో 750000 మంది ఉద్యోగులు ఉన్నారు. గత కొన్ని నెలల కింద కొంతమంది ఉద్యోగులను కంపెనీ తొలగించే ప్రయత్నం చేసింది. కానీ వెనక్కు తగ్గింది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవాలని యాక్సెంచర్ చూస్తోందన్న ప్రచారం సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు