Jammu and kashmir: జేకేలో ముగిసిన మొదటి విడత ఎన్నికలు

జమ్మూ–కశ్మీర్‌‌లో జరుగుతున్న మొదటి దశ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. దాదాపు 59శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్‌ పీకే పోలె తెలిపారు. ఎక్కడా ఎలాంటి గొడవలూ జరగకుండా పోలీంగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పారు.

New Update
polling

Election Polling:

జమ్మూ–కశ్మీర్‌‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో మొదటి దశ పోలింగ్ పూర్తయింది. మొత్తం 24 స్థానాలకు ఈరోజు పోలింగ్ నిర్వహించారు. దాదాపు 23లక్షల మంది ఓటర్లు 219 మంది అభ్యర్థులకు తమ ఓట్లను వేశారు. మొత్తం అన్ని స్థానాల్లో 59శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్‌ పీకే పోలె వెల్లడించారు. కిశ్త్‌వాడ్‌లో అత్యధికంగా 77శాతం ఓటింగ్ నమోదవగా.. పుల్వామాలో అత్యంత తక్కువగా 46శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపారు. అన్ని చోట్లా ఓటింగ్‌ ప్రక్రియ సజావుగానే సాగిందని.. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని పోలె చెప్పారు.

ఇక ఈ రాష్ట్రంలో సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 8న మొత్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Also Read: Andhra Pradesh: తెలుగు తమ్ముళ్ళకు బంపర్ ఆఫర్..పార్టీ సభ్యత్వం

Advertisment
తాజా కథనాలు