India: ప్రాణాలతో చెలగాటం..49శాతం ఫేక్ మెడిసన్స్..

మనుషులు బతికేది ఆరోగ్యం కోసం. అది బాలేకపోతే మందులు మీద ఆధారడతారు. కానీ అవే నకిలీవి అయితే. ప్రాణం పోయాల్సిన మందులే ప్రాణాలు తీస్తే..జీవితాలతో వ్యాపారం చేస్తూ ఫేక్ మెడిసిన్స్ ను అమ్ముతున్నారు. దేశంలో 49 శాతం మందులు నకిలీవి అని తేలడమే ఇందుకు నిదర్శనం. 

New Update

Fake Medicine: 

ఫేక్‌.. అంతా ఫేక్.. ఆఖరికి మందులు కూడా ఫేక్.. ట్యాబ్లెట్‌ వేసుకోవాలంటేనే భయం పుట్టే రోజులు వచ్చేసి చాలా కాలం అయ్యింది.. ఎందుకంటే మనుషుల ప్రాణాలను కాపాడే మెడిసన్స్‌ కూడా నకిలీవే తయారవుతున్నాయి. ఎంత ఘోరం..! ప్రాణాలతోనే ఆడుకోవడం, జీవితాలతో వ్యాపారం చేయడం ఎంత నేరం..! దేశంలో ఈ ఒక్క సెప్టెంబర్‌లో జరిపిన క్వాలిటీ టెస్టుల్లో 49 శాతం మందులు ఫెయిల్ అయినట్లు ప్రభుత్వ అధికార లెక్కలు చెబుతున్నాయి. గతంలోనూ ఎన్నో కంపెనీలు నకిలీ మందులను విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయాయి. భవిష్యత్‌లోనూ దొరుకుతాయి. మరి ఈ నకిలీ మెడిసన్స్‌ అమ్మకాలకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు?


సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరీక్షల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మధుమేహం, కడుపు నొప్పి లాంటి వాటికి సంబంధించిన మందులు, అలాగే మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్, పెయిన్‌కిల్లర్‌లు ఎక్కువగా నకిలీవి ఉన్నాయని CDSCO గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై ప్రజలు, వైద్యులు, సంబంధిత రంగంలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని CDSCO సూచిస్తోంది. ఇక లైఫ్ మ్యాక్స్ క్యాన్సర్ ల్యాబొరేటరీస్ తయారు చేసిన కాల్షియం 500 ఎంజి, విటమిన్ డి3 మాత్రలు నాణ్యత పరీక్షలో విఫలమైన మందులలో ఉన్నాయి. 


నకిలీ లేదా నాసిరకం మందులు రోగులకు తీవ్రంగా హాని కలిగిస్తాయి. అవి మరణానికి కూడా కారణమవుతాయి. నకిలీ మందులు హానికరమైన రసాయనాలు లేదా మలినాలను కలిగి ఉండవచ్చు. ఇవి అలెర్జీకి దారితీస్తాయి. విషప్రయోగం లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ప్రేరేపిస్తాయి. అటు దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బులు లేదా స్ట్రోక్ లాంటి సమస్యలను ఫేక్ మెడిసన్స్‌ పెంచుతుంది. నాసిరకం పదార్ధాలను కలిగి ఉన్న నకిలీ యాంటీబయాటిక్స్ వాడకం చెడు బ్యాక్టీరియా అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇది ప్రజారోగ్యానికి ముప్పును కలిగిస్తుంది.


నిజానికి ఫార్మాకు అతి పెద్ద కేంద్రం ఇండియానే. భారత్‌ మందులనే ఇతర దేశాల ప్రభుత్వాలు ఎక్కువగా విక్రయిస్తాయి. ఇతర దేశాలకు భారతీయ మందులు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. ఇలా ప్రపంచంలోని అతిపెద్ద ఔషధ ఉత్పత్తిదారి, ఎగుమతిదారుల్లో ఒకటైన భారత్‌లో నాసిరకం మందులు ఎక్కువగా ఉత్పత్తి అవుతుండడం దేశ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తోంది. గాంబియా, యుజ్బెకిస్తాన్, కామెరూన్‌లలోని పిల్లల మరణాలకు ఇండియాలో తయారైన దగ్గు సిరప్‌లు కారణమని గతంలో నివేదికలు తేల్చాయి. దీంతో భయపడిపోయిన ఎన్నో దేశాలు ఇండియా నుంచి మందులను కొనుగోలు చేయడం ఆపేశాయి.

నకిలీ మందులు ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO ప్రకారం, నకిలీ మందులు ప్రపంచ ఔషధ మార్కెట్లో దాదాపు 10శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ ఉత్పత్తులలో ఎక్కువ భాగం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. కరోనా కాలంలో ఈ ధోరణి పెరిగింది. కరోనా సమయంలో వ్యాక్సిన్‌లతో ఇతర మెడిసన్స్‌కు సంబంధించిన ఆన్‌లైన్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ నకిలీ మందులు కనిపిస్తాయి. అనేక ఇతర దేశాల లాగానే ఇండియా కూడా ఆన్‌లైన్‌లో విక్రయించే నకిలీ మందుల సమస్యను ఎదుర్కొంటోంది. నివేదికల ప్రకారం, నకిలీ మందుల ఉత్పత్తి, పంపిణీలో ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. 


అనేక ఆన్‌లైన్ ఫార్మసీలు నకిలీ మందులను విక్రయిస్తూ రోగులను ప్రమాదంలో పడేస్తున్నాయి. నిజానికి CDSCO ప్రతి నెలా నాసిరకం మందుల జాబితాను ప్రచురిస్తుంది. అయినా కూడా నకిలీ మందులు మార్కెట్‌లోకి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇటు తెలంగాణలోనూ నకిలీ మందులను ఇష్టారీతిన అమ్ముతున్నారన్న సమాచారం ఉంది. లేని కంపెనీల పేరుతోనూ మందులు మార్కెట్‌లో లభిస్తుండడం మరో వింత. వీటితో పాటు లైసెన్స్‌లేని సంస్థలు మందు మందులను తయారు చేసి మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నారు కేటుగాళ్లు. అటు లైసెన్స్‌లు రద్దయిన కంపెనీల పేర్లతో మందులు తయారీ చేస్తున్న వ్యవహారం కూడా గతంలో హైదరాబాద్‌లో బయటకొచ్చింది. 

Also Read: రెండో టెస్ట్‌లోనూ చేతులెత్తేసిన ఇండియా..చరిత్ర సృష్టించిన కీవీస్
 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe