/rtv/media/media_files/2024/10/26/ixkHpGfwxRqRegjqkugp.jpg)
ప్రేమ.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిలో, ఎందుకు పుడుతుందో తెలియదు. అది ప్రేమ ? లేక అట్రాక్షనా అని కూడా అర్థంకాదు. తెలిసితెలియని వయస్సులోనే కొందరు ప్రేమలో పడతారు. ఆ ప్రేమ కాస్త వ్యామోహానికి దారితీయడంతో హద్దులు దాటి ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. తాజాగా అలాంటిదే జరిగింది. 19 ఏళ్ల అమ్మాయి 21 ఏళ్ల అబ్బాయిలో ప్రేమలో పడింది. అతడిని ఎంతగానో ప్రేమించింది. అయితే ఆ యువకుడు తన పేరుకు బదులు వేరోక పేరుతో ఆమెతో మెలిగాడు. ఇద్దరూ కొంతకాలం ప్రేమలో మునిగితేలారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు ప్రేయసిని గర్భవతిని చేశాడు. దీంతో ఓ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కోపంతో చిర్రెత్తిపోయిన ఆ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ప్రేయసిన హత్య చేసి పూడ్చిపెట్టాడు. ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం!
సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్
ఢిల్లీలోని నాన్‌గ్లోయి ప్రాంతానికి చెందిన సోనీ అనే 19 ఏళ్ల అమ్మాయి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ మార్చుకోవాలనుకుంది. దీంతో తరచూ చిన్న చిన్న వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ఉండే అందాలను రికార్డ్ చేసి పోస్ట్ చేసేది. అలా ప్రతి రోజూ కొత్త కొత్త వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉండేది.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్!
ఓ యువకుడితో ప్రేమాయణం
కొంతకాలం క్రితం ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో తరచూ అతడితో మాట్లాడేది. అయితే ఓ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సోనీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు!
Shocking case from Delhi
— Janta Journal (@JantaJournal) October 25, 2024
19 year old Soni Kumari killed by her boyfriend Salim and 2 friends of his by taking her to Rohtak
Soni Kumari was 7 month pregnant and asking Salim to marry her pic.twitter.com/zu22BCn6qb
సోనీ ఫోన్ డేటా ట్రాక్ చేశారు. అందులో సోనీ తరచూ మాట్లాడుతున్న నెంబర్‌ను కనుకున్నారు. ఆ నెంబర్‌ను ట్రాక్ చేయగా.. అది 21 ఏళ్ల సంజు అలియాస్ సలీం అనే యువకుడిదని తెలిసింది. అతడి ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయగా.. హర్యాణాలోని రోహ్‌తక్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసులను సంప్రదించగా వారు వెంటనే సంజుని పట్టుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. సంజుని ప్రశ్నించగా అసలు విషయం బయటకొచ్చింది.
ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్
అసలు స్టోరీ ఇదే
సోనీ, సంజు గత సంవత్సర కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అతడు సోనీని గర్భవతిని చేశాడు. దీంతో వారిద్ధరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పెళ్లి చేసుకుందాం అని సోనీ పలుమార్లు సంజుతో గొడవపడింది. ఇక సోమవారం కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లిన సోనీ మళ్లీ గొడవపడింది. దీంతో కోపగ్రస్తుడైన సంజు ఆమెను హత్య చేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని తన స్నేహితులతో కలిసి రోహ్‌తక్‌లో పూడ్చిపెట్టాడు. దీంతో పోలీసులు సోనీ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఈ కేసులో నిందితులుగా ఉన్న సంజు అండ్ అతని స్నేహితుడిని అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.