CPI Narayana: పాలస్తీనాలో శాంతి కోసం సీపీఐ శాంతిర్యాలీ..పాల్గొన్న నారాయణ

విజయవాడలో సీపీఐ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. పాలస్తీనాలో శాంతి నెలకొనాలని ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. అమెరికా ప్రపంచంలోనే పెద్ద టెర్రరిస్ట్ దేశం అని ఆరోపించారు.

New Update
CPI Narayana:బిగ్ బాస్ మీద మళ్ళీ నోరుపారేసుకున్న సీపీఐ నారాయణ

విజయవాడలో సీపీఐ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. పాలస్తీనాలో శాంతి నెలకొనాలని ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. అమెరికా ప్రపంచంలోనే పెద్ద టెర్రరిస్ట్ దేశం అని ఆరోపించారు. ఒక అమెరికా తప్ప ఇజ్రాయిల్ ధమన నీతిని అన్ని దేశాలు ఖండిస్తున్నాయని ఆయన ఫైర్‌ అయ్యారు. హాస్పటల్ మీద, ప్రజల మీద దాడులు చేయకూడదని ఒక నీతి సూత్రం ఉంది. దానిని విస్మరించి పాలస్తీనాలో దాడులు చేస్తున్నారని నారాయణ విమర్శలు చేశారు.పాలస్తీనా న్యాయపోరాటంలో విజయం సాధిస్తుందని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా భవిష్యత్‌లో ఇజ్రాయెల్‌కి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

భవిష్యత్‌లో ఇజ్రాయెల్‌కి గుణపాఠం తప్పదు

రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తుందన్నారు. ఒక దేశాన్ని లేకుండా చేయడానికి ఇజ్రాయిల్ ఇంత దురాగతానికి పాల్పడుతుందని మండిపడ్డారు. పసి పిల్లలపై, మహిళలపై దాడులు చేస్తున్నారని, పాలస్తీనాలో వేలమంది చనిపోయారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ ప్రధాని ఇజ్రాయెల్‌కి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రమాదకరమని హెచ్చరించారు. అలీన దేశాలకు నాయకత్వం వస్తున్న భారత్ పాలస్తీనాకు మద్దతుగా నిలబడాలని డిమాండ్‌ చేశారు.

సీఆర్ ప్రభుత్వం కూడా కూలిపోబోతుంది

పాలస్తీనా నిలబడడానికి, గెలవడానికి భారతదేశం అండగా ఉండాలని కోరుతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వంతెనలు కూలినట్టే కేసీఆర్ ప్రభుత్వం కూడా కూలిపోబోతుందని నిన్న ఆయన సంచలన కామెంట్స్ చేశారు. కరీంనగర్‌లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ బంధువులకు కాంట్రాక్టర్లకు అప్పజెప్పి.. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించే విధంగా పనులు పూర్తి చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. కేబుల్ బ్రిడ్జిని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడవెంకట్‌రెడ్డితో పాటు స్థానిక నాయకులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి తన పార్టీలోని మంత్రులు చేస్తున్న అవినీతి గుర్తించాలని నారాయణ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు మన భారత జాతి సంపద: నన్నపనేని రాజకుమారి

Advertisment
Advertisment
తాజా కథనాలు