National Girl Child Day 2024 : మహిళా విద్యార్థులకు ప్రత్యేకంగా ఉన్న 4 భారతీయ స్కాలర్‌షిప్‌ల వివరాలు!

ఇవాళ జాతీయ బాలిక దినోత్సవం. బాలికా విద్యార్థుల కోసం కొన్ని ముఖ్యమైన స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. AICTE ప్రగతి, బేగం హజ్రత్ మహల్, ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్, మహిళా సైంటిస్ట్ స్కీమ్-B ఈ లిస్ట్‌లో ఉన్నాయి. వీటి గురించి పూర్తి సమాచారం ఆర్టికల్ మొత్తం చదవండి.

National Girl Child Day 2024 : మహిళా విద్యార్థులకు ప్రత్యేకంగా ఉన్న 4 భారతీయ స్కాలర్‌షిప్‌ల వివరాలు!
New Update

Scholarships for Female Students : ప్రతి జనవరి 24న దేశంలో బాలికల హక్కులు, సంక్షేమాన్ని హైలైట్ చేయడానికి జాతీయ బాలికా దినోత్సవాన్ని(National Girl Child Day) జరుపుకుంటారు. ఇదే సమయంలో బాలికా విద్యార్థుల కోసం కొన్ని ముఖ్యమైన స్కాలర్‌షిప్‌(Scholarship) లను తెలుసుకోండి. సాంకేతిక విద్య కోసం AICTE ప్రగతి, మైనారిటీ బాలికలకు బేగం హజ్రత్ మహల్, ఒంటరి బాలిక పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్, వృత్తిని అభ్యసిస్తున్న మహిళలకు మహిళా సైంటిస్ట్ స్కీమ్-B ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

--> బాలికల కోసం AICTE ప్రగతి స్కాలర్‌షిప్:
లక్ష్యం :
బాలికల కోసం AICTE ప్రగతి స్కాలర్‌షిప్ అనేది దేశంలో సాంకేతిక విద్యను అభ్యసించడంలో బాలికలకు మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి రూపొందించిన కార్యక్రమం.

అర్హత షరతులు : రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాని(State/Central Government) కి కేంద్రీకృత ప్రవేశ ప్రక్రియ ద్వారా అభ్యర్థులు ఏదైనా AICTE ఆమోదించిన సంస్థలో డిగ్రీ లేదా డిప్లొమా ప్రోగ్రామ్ ఒకటో సంవత్సరంలో చేరి ఉండాలి. ప్రతి కుటుంబానికి 'ఒక అమ్మాయి'కి మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది. కుటుంబ ఆదాయం రూ.8లక్షల కంటే తక్కువ ఉంటే 'ఇద్దరు ఆడపిల్లలకు' వర్తింపచేయవచ్చు.

ట్యూషన్ ఫీజు: రూ. 30,000/-
సంవత్సరానికి 10 నెలల పాటు నెలకు రూ.2,000/-.

--> బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్‌షిప్:
బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్‌షిప్, గతంలో మౌలానా ఆజాద్ నేషనల్ స్కాలర్‌షిప్ అని పిలిచేవారు. ఇది మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన ప్రతిభావంతులైన బాలికల విద్యార్థుల కోసం ఉన్న స్కాలర్‌షిప్‌.

అర్హత : మునుపటి అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు వార్షిక ఆదాయం రూ.2లక్షలు మించకుండా ఉన్న ఆరు నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన బాలికలకు ఈ స్కాలర్‌ షిప్‌ ఉంటుంది.

స్కాలర్‌షిప్ మొత్తం:
IX & X తరగతి బాలికలకు నెలకు రూ.5,000/-.
XI & XII తరగతి బాలికలకు నెలకు రూ. 6,000/-.

--> సింగిల్ గర్ల్ చైల్డ్ కోసం పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్:
లక్ష్యం : ఈ స్కాలర్‌షిప్ నాన్-ప్రొఫెషనల్ పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసిస్తున్న బాలికలకు సహాయం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది.
అర్హత షరతులు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా పోస్ట్-గ్రాడ్యుయేట్ కళాశాలల్లో రెగ్యులర్, పూర్తి-సమయం 1వ-సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకున్న ఆడపిల్లలకు వర్తిస్తుంది. దూర విద్య కోర్సులు కవర్ చేయదు.

స్కాలర్‌షిప్ మొత్తం:
పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి వ్యవధిలో రెండు సంవత్సరాల కాలానికి నెలకు రూ.2,000/-.

--> ఉమెన్ సైంటిస్ట్ స్కీమ్-B (WOS-B)
అర్హత షరతులు : ST ప్రాంతాలలో అర్హతలు కలిగిన 27-57 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఈ స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది. పర్మినెంట్ ఉద్యోగులు అనర్హులు.
స్కాలర్‌షిప్ మొత్తం:
Ph.D. లేదా తత్సమానం: నెలకు రూ. 55,000/-
M.Phil./MTech లేదా తత్సమానం: నెలకు రూ. 40,000/-
M.Sc. లేదా తత్సమానం: నెలకు రూ. 31,000/-

Also Read: జాతీయ బాలికా దినోత్సవం .. జనవరి 24నే ఎందుకు?

WATCH:

#aicte #scholarships #national-girl-child-day-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe