Nathan Lyon: 500 వికెట్ల క్లబ్లో నాథన్ లియోన్.. గతంలో ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా! కంగారూ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో పెర్త్ వేదికగా ముగిసిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు వికెట్లు పడగొట్టిన లియోన్ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. By Naren Kumar 17 Dec 2023 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nathan Lyon: కంగారూ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో పెర్త్ వేదికగా ముగిసిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు వికెట్లు పడగొట్టిన లియోన్ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. లియోన్ తన మైలురాయి వికెట్‌ను డీఆర్‌ఎస్‌కు వెళ్లి సాధించడం విశేషం. లియోన్ కన్నా ముందు ఇప్పటివరకూ టెస్ట్ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన క్రికెటర్లు ఏడుగురు మాత్రమే కావడం గమనార్హం. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (690), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519) లియోన్ కన్నా ముందు 500 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్న లిస్టులో ఉన్నారు. FIVE HUNDRED! #AUSvPAK #PlayOfTheDay @nrmainsurance pic.twitter.com/DyDC5hUdTJ — cricket.com.au (@cricketcomau) December 17, 2023 కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన పెర్త్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆతిథ్య కంగారూ జట్టు 360 పరుగుల భారీ తేడాతో ఘన విజయం నమోదు చేసింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన ఆసిస్ ఆటగాళ్లు పాక్ జట్టును సునాయాసంగా ఓడించగలిగారు. ఇది కూడా చదవండి: అండర్-19 ఆసియా కప్ విన్నర్ బంగ్లాదేశ్.. ఫైనల్లో యూఏఈ చిత్తు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్ వికెట్ తీయడంతో లియోన్ 500 వికెట్లు తీసిన లెజెండరీల జాబితాలో చేరాడు. కాగా, ఆసిస్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ లియోన్. అంతకుముందు వార్న్, మెక్‌గ్రాత్ ఆసీస్ తరఫున 500 వికెట్లు పడగొట్టిన వారిలో ఉన్నారు. లియోన్ 123 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. Nathan Lyon is an All-time legend of Test cricket. 🫡 pic.twitter.com/qjP4wYv5lg — Johns. (@CricCrazyJohns) December 17, 2023 #sports-news #nathon-lyon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి