/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Road-accident-jpg.webp)
Hyderabad: నార్సింగీ ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబై వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు బస్సు చెక్రాల కింద నలిగిపోయారు. పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు వెంటనే క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో 2 కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులో పలు కుటుంబాలుండగా.. క్రేన్ సహాయంతో బస్సు రోడ్డు నుంచి పోలీసులు, సిబ్బంది తొలగించారు. వీడియోలు వైరల్ అవుతున్నాయి.