/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/naresh-jpg.webp)
Naresh Pavithra: గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటుడు, హీరో వీకే నరేష్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ సహాజీవనం చేస్తున్నారని మొన్నటి వరు పుకార్లు బీభత్సంగా షికార్లు చేశాయి.
వాటన్నింటిన మొదట్లో ఖండించిన వీళ్లిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు ప్రకటించారు. అది కూడా ఫుల్ రొమాంటిక్ గా పవిత్రకు నరేష్ లిప్ కిస్ ఇచ్చిన వీడియోను షేర్ చేసి మరి అధికారికంగా వెల్లడించారు.
New Year ✨
New Beginnings 💖
Need all your blessings 🙏From us to all of you #HappyNewYear ❤️
- Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022
కొన్ని నెలల తరువాత ఒక్క వీడియోతో టాలీవుడ్ ని షేక్ చేశాడు నటుడు నరేష్. ఆయన తనకు పెళ్ళైనట్లు ఒక వీడియో షేర్ చేశారు. మార్చి 10వ తేదీ ఉదయం నరేష్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. నటి పవిత్ర లోకేష్ మెడలో ఆయన తాళి కట్టాడు. కొందరు బంధువుల మధ్య ఈ పెళ్లి తంతు ముగిసినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది.
Seeking your blessings for a life time of peace & joy in this new journey 🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముడ్లు
ఏడు అడుగులు 🙏మీ ఆశీసులు కోరుకుంటూ
- మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/mll7zADbTK— idlebrain.com (@idlebraindotcom) March 10, 2023
కాగా, ఇప్పుడు ఈ జంట హనీమూన్ కోసం వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జంట థాయిలాండ్ వెళ్లింది. విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను లోకేష్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో పిక్స్ చూసిన నెటిజన్లు ఈ వయసులో హనీమూన్ ఏంట్రా బాబు అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Explored the wonders of Helicopter Island, discovering a hidden beach gem during our Philippines sea adventure with Pavitra.
Also Travelled to El Nido Island, unveiling the beauty of the secret lagoon beach, adding more memorable moments to our shared journey.
These memories… pic.twitter.com/ynxYvceBVQ
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 2, 2023
అయితే, నరేష్‌కి మూడో భార్య రమ్య విడాకులు ఇవ్వకపోవడంతో ఈ జంటకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ, ఇద్దరూ భార్యాభర్తలుగా కలిసి జీవితాన్ని గడుపుతున్నారు. ఈ జంట తమ జీవిత కథాంశంతో మళ్లీ పెళ్లి అనే చిత్రాన్ని రూపొందించారు.
ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. సినిమా పెద్దగా హిట్ కాలేదు. నటి పవిత్రా లోకేష్ కూడా తన పిల్లలతో తెలంగాణలోనే సెటిల్ అయింది. నరేష్‌తో హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తోంది.