Narayana College : నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలి

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలి అయ్యాడు. హైదరాబాద్‌లో ఉన్న మాదాపూర్‌ నారాయణ బ్రాంచ్‌లో కనకరాజు అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

New Update
Narayana College : నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలి

Narayana College Student Suicide: నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలి అయ్యాడు. హైదరాబాద్‌లో ఉన్న మాదాపూర్‌ నారాయణ బ్రాంచ్‌లో కనకరాజు అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కనకరాజు తూప్రాన్ మండలం మామిడాలకు చెందిన కనకరాజు బైపీసీ రెండో ఏడాది చదువుతున్నాడు. విద్యార్థి ఆత్మహత్యను కవర్‌ చేయడానికి వెళ్లిన మీడియా సిబ్బందిని పోలీసులు, నారాయణ సిబ్బంది బయటకు తోసేశారు. ఆత్మహత్య వెనుక వాస్తవాలేంటో... బయటకు చెప్పకుండా కాలేజ్‌ సిబ్బంది దాస్తోంది. నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని మరోవైపు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయణపై మర్డర్ కేసులు పెట్టాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు బయటకు రాకుండా సిబ్బంది తాళాలు వేశారు.

నారాయణ కాలేజ్‌ తీరుపై కనకరాజు తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన కొడుక్కి జ్వరం వచ్చిందని, ఆస్పత్రిలో చేర్పించినా త్వరగా రావాలని ఫోన్‌ చేసి వేధించారని తెలిపారు. తన కొడుకు చనిపోయిన విషయాన్ని కనీసం చెప్పలేదని వాపోయారు. తన కొడుకుని కొట్టి చంపారన్న తండ్రి ఆరోపించారు. కాలేజ్‌ సిబ్బంది వేధిస్తున్నారని తన కొడుకు... చాలాసార్లు తనతో చెప్పారని తెలిపారు. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి తనకు ఫోన్‌ చేయలేదన్నారు. ఇక్కడికి వచ్చాకే తన కొడుకు చనిపోయారని చెప్పారని కన్నీటి పర్యంతమయ్యారు. తన కొడుకును చూపించండని వేడుకున్నారు. తనకు చెప్పకుండా పోస్టుమార్టం ఎలా చేస్తారని నిలదీశారు. నారాయణ ప్రిన్సిపల్‌కు అంతా తెలుసని.. తన కొడుకు తనకు కావాలని కన్నీళ్లు పెట్టుకున్నారు.

మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రణవి క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అటెండెన్స్ తీసుకుంటున్న సమయంలో కనకరాజు తరగతి గదిలో లేడని.. తన గదిలో ఫ్యాన్‌కి ఉరి వేసికున్నట్లు గుర్తించి కిందకి దింపామని తోటి విద్యార్థులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తుచేస్తున్నామని.. కొన ఊపిరితో ఉన్న విద్యార్థిని ఆసుపత్రికి తరలించామని సిబ్బంది, పోలీసులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు