మంగళగిరి కోర్టుకు వెళ్లిన నారా లోకేష్‌..అసత్య ప్రచారంపై న్యాయపోరాటం

తనపై, తన కుటుంబ సభ్యులపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ యువనేత నారా లోకేష్‌ న్యాయపోరాటం చేస్తున్నారు. ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్, ఏపీ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై ఆయన క్రిమినల్ కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరిపై ఐపీసీ 499, 500 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

New Update
Lokesh: ప్యాలెస్ బ్రోకర్ సజ్జల.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

తప్పుడు ప్రచారం చేస్తున్నారు

తన పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో చనిపోయినప్పుడు... వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా తనపై దుష్ప్రచారం చేశారని... తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణిలపై పోతుల సునీత దారుణ వ్యాఖ్యలు చేశారని లోకేష్‌ కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆయన ఈరోజు మంగళగిరి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చారు. మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. మరోవైపు, ఇప్పటికే ఆయన సాక్షి పత్రికపై పరువునష్టం దావా వేశారు. కోర్టుకు హాజరుకావడం కోసం ఆయన తన పాదయాత్రకు రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు.

Nara Lokesh who went to Mangalagiri court..legal battle against false propaganda

కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రెండు రోజులు యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేశారంటూ వారిపై లోకేష్‌ పరువునష్టం దావా వేశారు. ఇందులో భాగంగా మంగళగిరి అడిషినల్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు హాజరైయ్యారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత గతేడాది నిర్వహించిన మీడియా సమావేశంలో హెరిటేజ్‌ సంస్థ ద్వారా చంద్రబాబు కుటుంబం సారా పరిశ్రమ నడుపుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు, దేవేందర్‌రెడ్డి పెట్టిన పోస్టులపై లోకేష్‌ మంగళగిరి కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. గుర్రంపాటి దేవేంద‌ర్‌రెడ్డి, పోతుల సునీత‌ల‌పై దాఖ‌లు చేసిన కేసుల్లో ఐపీసీ సెక్షన్ 499,500 ప్రకారం క‌ఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఇందులో భాగంగా పాదయాత్ర ముగిశాక అమరావతి చేరుకున్నారు. తిరిగి రేపటి నుంచి యువగళం పాదయాత్ర కొనసాగుతుదని తెలిపారు.

చరిత్రలోనే తప్పు చేయలేదు

ఈ సందర్భంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాది.. తన మీద వ్యక్తిగత విమర్శలు చేయటం తగదన్నారు. రాజకీయాల్లోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ తన చదువు గురించి, స్టాన్ఫోర్డ్ చదివిన విషయంపై ఆరోపణలు చేశారు. బాడీ షేమింగ్ చేయడం, భాష మీద ఆరోపణలు చేశారని.. స్కిల్ డేవలప్‌మెంట్, ఏపీ ఫైబర్‌లో, రాజధానిపై విషయంలో తన మీద ఆరోపణలు చేశారని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత కూడా ఇదే స్థాయిలో తన మీద ఆరోపణలు చేశారని లోకేష్ అన్నారు. అందుకే వాళ్ల మీద పరువునష్టం దావా కేసులు వేశామన్నారు.

ఒక్క ఆరోపణలో నిజం లేదు

అంతే కాదు నా భార్య మీద నిరాధరణ ఆరోపణలు చేసారు.. నా తల్లిపై కూడా వైసీపీ కార్యకర్త దేవేందర్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని లోకేష్‌ మండిపడ్డారు. గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిపై 50 కోట్ల పరవు నష్టం దావా కేసు వేశానని ఆయన అన్నారు. దానికి సంబంధించిన వాంగ్మూలం ఇచ్చానని లోకేష్ చెప్పారు. ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నా కుటుంబం ఎప్పుడూ తప్పు చేయలేదని.. ఎన్టీఆర్ నుండి ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా రాజకీయాలు చేశామని లోకేష్‌ అన్నారు. మా మీద ఆరోపణలు చేసిన వాటిలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని లోకేష్‌ అన్నారు.

Advertisment