Vyooham Movie: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాపై హైకోర్టును ఆశ్రయించారు టీడీపీ నేత నారా లోకేష్. తెలంగాణ హైకోర్టులో దీనిపై పిటిషన్ వేసిన ఆయన.. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ డిసెంబర్ 26న విచారణకు రానుంది. రాంగోపాల్ వర్మ ఇష్టమొచ్చినట్లు సినిమా తీశారని ఆరోపించారు. ఆర్జీవీ తన ఇష్టాఇష్టాలతో పాత్రలను నిర్ణయించుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యూహం సినిమాలో చంద్రబాబును తప్పుగా చూపించారని, ట్రైలర్ మాదిరిగానే సినిమా అంతా ఉండే అవకాశం ఉందన్నారు.
చంద్రబాబును అప్రతిష్ట పాల్జేసేందుకే సినిమా తీశారని పిటిషన్‌లో పేర్కొన్నారు ఆర్జీవీ. వ్యూహం సినిమాతో జగన్‌కు లబ్ధి కలిగేలా చూస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు లోకేష్. వాక్ స్వాతంత్ర్యం పేరిట ఇష్టారీతిన సినిమా తీశారన్నారు. దర్శక, నిర్మాతల చర్యలతో చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందని, వ్యూహం సినిమాతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు. ఇప్పటికే దర్శక నిర్మాతలు పలు తప్పుడు చిత్రాలు విడుదల చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు లోకేష్. తీసిన సినిమాలకు లాభాలు రాకపోయినా మళ్లీ సినిమా తీస్తున్నారని ఆరోపించారు. నష్టాలు వస్తాయని తెలిసినా జగన్ లబ్ధి కోసమే చిత్రం తీశారన్నారు. ఏపీ సీఎం జగన్ వెనుక ఉండి వ్యహం సినిమా తీయించారని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.
Also Read:
పార్టీ కోసం వెయ్యి కోట్లు అడిగాడు.. జేడీపై కేఏపాల్ సంచలన ఆరోపణలు..