రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన నారా లోకేష్‌.. గంజాయిపై ఫిర్యాదు

వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేషన్ ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుందని.. దానికి సంబంధించిన అన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కి సమర్పించామని లోకేష్‌ అన్నారు. దీని వెనక వైసీపీ నేతలు ఉన్నారని లోకుష్‌ వివరించారు. ఈ గంజాయి వల్ల కుటుంబాలు.. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. దినంతటికి కారణమైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని లోకేష్ అన్నారు.

New Update
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన నారా లోకేష్‌.. గంజాయిపై ఫిర్యాదు

గంజాయిపై ఫిర్యాదు

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ నేడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో విచ్చలవిడి గంజాయి లభ్యతపై గవర్నర్‌కు యువనేత ఫిర్యాదు చేశారు లోకేష్‌. గవర్నర్‌తో లోకేశ్ భేటీ ఇదే తొలిసారి. అయితే ఏపీ గంజాయి రాష్ట్రంగా మారకుండా చర్యలు తీసుకోవాలని రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. పాదయాత్రలో రాష్ట్రం ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందంటూ మహిళలు, యువనేత లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గవర్నర్‌ను కలిసి లోకేష్‌.. గంజాయికి సంబంధించిన వివరాలను సీడీ, పెన్‌ డ్రైవ్ రూపంలో గవర్నర్‌కు ఇచ్చారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యులు మండల చైర్మన్ షరీఫ్, కొల్లు రవీంద్ర.. గవర్నర్‌ను కలిశారు. గవర్నర్‌కు ఫిర్యాదు అనంతరం లోకేష్‌ తిరిగి యువగళం పాదయాత్రకు బయలుదేరి వెళ్లిన్నారు.

Nara Lokesh met the Governor at Raj Bhavan. Complaint about ganja

యువగళం పాదయాత్ర  ప్రారంభం

ఇద్దరు వైసీపీ నేతలపై నారా లోకేష్‌ న్యాయపోరాటం చేస్తున్నారు. తనపైన, తన కుటుంబం పైన దుష్ప్రచారం చేశారంటూ వారిపై ఇప్పటికే పరువునష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నిన్న మంగళగిరి కోర్టులో లోకేష్‌ వాంగ్మూలం రికార్డ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే యువగళం పాదయాత్రకు గురువారం, శుక్రవారం రెండు రోజులు యువగళం పాదయాత్రకు లోకేష్ విరామం ప్రకటించారు.

కోర్టులో న్యాయపోరాటం

అయితే శుక్రవారంమేజిస్ట్రేట్‌ కోర్టులో న్యాయమూర్తి సమక్షంలోనారా లోకేష్‌ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్ డైరక్టర్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి పెట్టిన కొన్ని పోస్ట్‌లపై లోకేష్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అలాగే వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపైనా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. కొద్ది నెలల కిందట లోకేష్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య స‌మ‌స్యల‌తో ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై గుర్రంపాటి దేవేంద‌ర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారనేది లోకేష్‌ ఆరోపించారు. ఉమామహేశ్వరి మరణానికి జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 45లో ఉన్న 5.73 ఎకరాల భూవివాదమే కారణం అంటూ దేవేందర్‌రెడ్డి తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా తప్పుడు ప్రచారం చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ ఆరోపణలు అసత్యమని తేలడంతో తర్వాత మరో తప్పుడు వార్త ప్రచారంలోకి తెచ్చారనేది కోర్టులో లోకేష్‌ వివరించారు.

Advertisment
తాజా కథనాలు