BREAKING: కేశినేని నానికి బిగ్ బిగ్ షాక్‌.. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని కి లోకేశ్‌ గ్రీన్ సిగ్నల్!

విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాధ్(చిన్ని)కి నారా లోకేశ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో చిన్ని చేపడుతున్న కార్యక్రమాలను చూసి మెచ్చుకున్న లోకేశ్‌ బెజవాడ పార్లమెంట్‌ బాధ్యతలు అప్పగించారు. టీడీపీని మరింత బలపరచాలని చిన్నికి చెప్పారు లోకేశ్‌.

New Update
BREAKING: కేశినేని నానికి బిగ్ బిగ్ షాక్‌.. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని కి లోకేశ్‌ గ్రీన్ సిగ్నల్!

ట్విస్ట్‌లకు మారుపేరైన విజయవాడ(Vijayawada) రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేశినేని నాని(Kesineni Nani) వర్సెస్‌ కేశినేని చిన్ని(Kesineni Chinni) మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎంతోకాలంగా టీడీపీకి చిన్ని దగ్గర అవుతున్నారని నాని బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉన్నారు. ఇక చాలా కాలంగా కేశినేని చిన్నికి వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయవాడ నుంచి టికెట్ ఇస్తారని ప్రచారం జరగగా.. అది నిజమైంది. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాధ్ ( చిన్ని )కి నారా లోకేశ్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

అప్పటి నుంచే మొదలు:
నిజానికి 2019 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి నాని పార్టీ అధినేతలతో మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. పలు సందర్భాల్లో పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో ఆయన ఆ పార్టీని వీడి బీజేపీతో చేతులు కలుపుతారనే ప్రచారం సాగింది. పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం మానేసిన ఆయన ఇటీవల నారా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్రకు కూడా దూరంగా ఉన్నారు. ఈ యాత్రకు కేశినేని చిన్నిని ఇంచార్జ్‌గా చేశారు.

అయితే విజయవాడ తనదేనని.. మళ్లీ అక్కడి నుంచే పోటీ చేసి గెలుస్తానని నాని చెప్పుకొచ్చారు. దీంతో కేశినేని చిన్ని పరిస్థితి ఏంటి? ఆయన రాజకీయ ఆశయాలు ఏమౌతాయి? టీడీపీ నానికి టికెట్ ఇచ్చి చిన్నిని పక్కన పెడుతుందా? విజయవాడలో టీడీపీ వ్యూహం ఏమిటన్న ప్రశ్నలు అప్పట్లో తెలుగు తమ్ముళ్లను వేధించాయి. అయితే వాటన్నిటికి లోకేశ్‌ చెక్‌ చెప్పినట్టుగానే తెలుస్తోంది. ఇప్పుడు చిన్నికి టికెట్‌ ఇస్తున్నట్టు హామీ ఇవ్వడంతో కేశినేని నాని ఏం చేయనున్నారు విజయవాడ టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

Also Read: ఆర్జీవీ తల నరుకుతానన్న కొలికిపుడి కోసం ఏపీ సీఐడీ వేట.. నేరుగా ఇంటికి వెళ్లి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు