BIG BREAKING: లంచ్ తర్వాత బాహుబలి సినిమా చూపించారు.. లోకేశ్‌ విచారణలో ఏం ప్రశ్నలు అడిగారంటే?

నిన్న అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారన్నారు నారా లోకేశ్‌. కొత్త ప్రశ్నలు ఏమి అడగలేదని లోకేశ్‌ చెప్పారు. 47 ప్రశ్నలు వేశారన్నారు. ఐదు ప్రశ్నలు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మాత్రమే అడిగారన్నారు. లంచ్ తరవాత బాహుబలి సినిమా చూపించినట్టు చెప్పారు. ఈరోజుతో నారా లోకేశ్‌ విచారణ ముగిసిందన్నారు. సిట్ ఆఫీస్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళనున్నారు లోకేశ్‌.

New Update
Pawan Kalyan: యువగళం విజయోత్సవ సభకు పవన్ కళ్యాణ్.. అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!

నిన్న అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారన్నారు నారా లోకేశ్‌. కొత్త ప్రశ్నలు ఏమి అడగలేదని లోకేశ్‌ చెప్పారు. 47 ప్రశ్నలు వేశారన్నారు. ఐదు ప్రశ్నలు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మాత్రమే అడిగారన్నారు. లంచ్ తరవాత బాహుబలి సినిమా చూపించినట్టు చెప్పారు. ఈరోజుతో నారా లోకేశ్‌ విచారణ ముగిసిందన్నారు. సిట్ ఆఫీస్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళనున్నారు లోకేశ్‌.

లోకేశ్‌ ఇంకేం చెప్పారంటే?

⁍ 5 ప్రశ్నలు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మాత్రమే అడిగారు..

⁍ మళ్ళీ విచారణకు రావాలి లేదా అనే దాని పై అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేదు..

⁍ గతంలో నేను పని చేసిన శాఖకు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు లింక్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడిగారు..

⁍ లంచ్ తరవాత బాహుబలి సినిమా చూపించారు...

⁍ గూగుల్ మ్యాప్ చూపించి కంతేరు లో కొన్న హెరిటేజ్ భూములు గురించి అడిగారు..

⁍ నా ఆస్తులు గురించి,మేము కొన్న భూములుల వివరాలు లెక్కలు ఎప్పడో చెప్పాను..

⁍ వాటికీ మించి ఆస్తులు ఉంటే... ఎవరికైనా రాసి ఇస్తా అన్ని గతంలోనే చెప్పాను..

⁍ ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే..

⁍ 32 రోజులు అక్రమంగా చంద్రబాబును జైల్లో పెట్టారు.

నిన్న విచారణలో..:

మొదటిరోజు విచారణలో తనను మొత్తం 50 ప్రశ్నలు అడిగారని లోకేశ్ చెప్పారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో తాను కానీ, తన కుటుంబం కానీ ఎలా లబ్ధి పొందుతాం అని ప్రశ్నించారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రస్థావనే తన దగ్గరకు రాలేదన్నారు. ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకే సీఐడీ కాలయాపన చేస్తోదని ఆరోపించారు.  ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, ప్రతిపాదిత రింగ్ రోడ్ సమీపంలో హెరిటేజ్ భూములు కొనుగోలు, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి లో పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు పై సీఐడీ లోకేషన్ ను ప్రశ్నించినట్లు సమాచారం. దాదాపు అనేక ప్రశ్నలకు.. నాకు తెలియదు అని లోకేష్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు విషయంలో తన ప్రమేయం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు విషయంలో తన ప్రమేయం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే నిన్న జరిగిన విచారణకు నారా లోకేశ్‌ సహకరించలేదని సీఐడీ వర్గాలు వెల్లడించాయి. మరి ఇవాళ సహకరించారా లేదా అన్నదానిపై అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.

ALSO READ: ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. మాజీ మంత్రి నారాయణ విచారణపై హైకోర్టు కీలక ఆదేశాలు!

Advertisment
తాజా కథనాలు