TDP Motha Mogiddam: నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ టీడీపీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఈల ఊదారు, డబ్బులు వాయించారు. రాజమండ్రిలో లోకేష్ క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో జనాలతో కలిసి బ్రాహ్మణి పాల్గొన్నారు. సందర్భంగా ప్రభుత్వం తీరును తప్పుపడుతు, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఈలలతో మోత మోగించారు. క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్ధతుగా డబ్బులు, ఈలలతో మోత మోగించారు. సరిగ్గా 7 గంటలకు క్యాంపు కార్యాలయం బయట వీరంతా ఈలలు, డప్పుల శబ్ధాలు చేశారు. కంచాలు కొడుతూ, విజిల్స్, బూరెలు ఊదుతూ చంద్రబాబుకు తమ మద్ధతు ప్రకటించారు టీడీపీ శ్రేణులు. ఇక హైదరాబాద్ లో ఉన్న నారా భువనేశ్వరి.. ఇక్కడి నివాసంలో టీడీపీ శ్రేణులతో కలిసి మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి వద్ద డ్రమ్స్ కొట్టి చంద్రబాబుకు తమ మద్ధతు ప్రకటించారు.
పోలీసుల ఎంట్రీ..
ఇదిలాఉంటే.. 'మోత మోగిద్దాం' కార్యక్రమం నేపథ్యంలో లోకేష్ క్యాంపు వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున పబ్లిక్ ఎవరూ గుంపులు గుంపులుగా ఉండొద్దని స్పష్టం చేశారు. టీడీపీ క్యాంపు వైపు ఇతరులకు అనుమతి లేదని, అనుమతి లేని వారు బయటకు వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. బయటి వారు కార్యాలయం వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే, టీడీపీ శ్రేణులు పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేశారు. వారిని పట్టించుకోకుండా క్యాంపు వద్దకు భారీగా చేరుకున్నారు టీడీపీ శ్రేణులు.
This browser does not support the video element.
గంట కొట్టిన లోకేష్..
ఇక ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ సైతం 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరిసిస్తూ ఢిల్లీలో ఆయన గంట కొట్టారు. ఇక ఏపీలో బాలకృష్ణ, అచ్చెన్నాయుడు సహా టీడీపీ ముఖ్యనేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో, ప్రాంతాల్లో ఈ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు ఈలలు, బూరలు ఊదుతు, డప్పులు, కంచాలు మోగించారు.
ఢిల్లీలో మోత మోగిద్దాం కార్యక్రమంలో గంట కొట్టి తమ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేత నారా లోకేష్, ఇతర నేతలు..
This browser does not support the video element.
Also Read:
Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన
Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్