/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/bhuvaneswari-nara.jpg)
Nara Bhuvaneshwari In Assembly :ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ఆసక్తికర ట్వీట్ చేశారు. 'నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది..ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం'! అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు!
నిజం గెలిచింది….ప్రజాస్వామ్యం నిలిచింది. ప్రజలకు ప్రణామం!#TeluguAtmaGauravamWinspic.twitter.com/mnyuQu5Pt6
— Nara Bhuvaneswari (@ManagingTrustee) June 21, 2024
ఈ ట్వీట్‌కు వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వంలో చంద్రబాబు శపథం చేసిన వీడియోను జత చేశారు. రెండున్నరేళ్ల క్రితం ఆయన భార్య భువనేశ్వరిని నిండు అసెంబ్లీ (Assembly) లో వైసీపీ వారు అవమానించడాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు తీవ్ర మనస్తాపంతో అసెంబ్లీని వీడారు. ఇలాంటి కౌరవ సభలో తానుండలేనని.. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని 19 నవంబరు 2021న శపథం చేశారు. ఆయన అన్నట్టుగానే తిరిగి ఈ రోజు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : ఎమ్మెల్సీ కవితకు బెయిలా? జైలా?