/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Lokesh-Off-to-Delhi-jpg.webp)
Nara Bhuvaneshwari and Lokesh Off to Delhi: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నారా లోకేష్, భువనేశ్వరి ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావటంతోనే వారు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే, సడన్‌గా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఢిల్లీ ప్రయాణం చేపట్టడం వెనుక కారణాలేంటనే దానిపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అమిత్ షాతో భేటీ?
ఇదిలాఉంటే.. నారా లోకేష్ తన ఢిల్లీ ప్రోగ్రామ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై కేసుల అంశంపై షా తో లోకేష్ చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమనేది.. ఆయన ఢిల్లీకి వెళ్లాకే తెలుస్తుంది.
కాగా, నారా లోకేష్ ఉన్నపళంగా రాజమండ్రి నుంచి ఢిల్లీకి బయలుదేరడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ టూర్‌లో భాగంగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై జాతీయ మీడియాతో లోకేష్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేష్ ఢిల్లీ టూర్ చేపట్టినట్లు మరో టాక్ వినిపిస్తోంది. అలాగే, చంద్రబాబుపై కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయ వాదులతో లోకేష్ చర్చించనున్నారట. పార్లమెంట్‌లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించెలా టీడీపీ వ్యూహరచన చేస్తోంది. పార్లమెంట్ స్పెషల్ సమావేశాల సందర్భంగా.. చంద్రబాబు అరెస్ట్ పై లోక్‌సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో మాట్లాడనున్నారు లోకేష్.
పవన్, బాలయ్యతో చంద్రబాబు కీలక చర్చలు..
తన అరెస్ట్ నేపథ్యంలో.. సీఎం జగన్, బీజేపీ ఏకమైనట్లు చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఇవాళ జైల్లో బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ములాఖత్ సమయంలో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు అంశాలపై బాలయ్యకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారట. తన అరెస్ట్‌పై బీజేపీ ఇప్పటి వరకు స్పందించకపోవడంపై చంద్రబాబు అసహనంలో ఉన్నారట. బాలయ్యను ఢిల్లీకి వెళ్లాల్సిందిగా, ఇండియా కూటమితో చర్చలు జరపాలని సూచించారట. తనపై కేసుల విషయంలో బీజేపీ, జగన్ కలిసే ప్లాన్ చేస్తున్నట్లుగా చంద్రబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీని పూర్తిగా తొక్కిపడెసేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. జగన్‌పై కేసులు పూర్తిగా పక్కకు పోయాయని, అడిగిన వెంటనే ఢిల్లీ పెద్దల నుంచి అపాయింట్‌మెంట్ దొరుకుతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి దృష్టికి ఈ అంశాలన్నింటినీ తీసుకెళ్లాలని బాలకృష్ణకు సూచించారు చంద్రబాబు.
Also Read:
Telangana Elections: ఇక నుంచి నా ఫోకస్ ఆ సీట్‌పైనే.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..
Roja vs Pawan: బాలకృష్ణను పక్కన పెట్టేందుకే పవన్..? ఇది కుట్ర..! రోజా సంచలన వ్యాఖ్యలు