Nani Movie : అన్నీ వున్నా..హాయ్..నాన్నకి అక్కడ దెబ్బ పడింది..

థియేటర్లన్నీ యానిమల్ కబ్జాలో.. హిట్ టాక్ తెచ్చుకున్నా హాయ్..నాన్నకు స్క్రీన్స్ కరువు. మరోవైపు యూఎస్ లో నాని మిలియన్ క్లబ్ లో మళ్ళీ చేరిపోయాడు. వరుసగా 9 వ నాని సినిమా మిలియన్ క్లబ్ లో చేరింది. హీరో మహేష్ బాబు 11సినిమాల తరువాత నాని 9 సినిమాలతో ఉండడం విశేషం

New Update
Nani Movie : అన్నీ వున్నా..హాయ్..నాన్నకి అక్కడ దెబ్బ పడింది..

Hi Nanna :  ఒక్కోసారి అలానే అవుతుంది. మొదట్నుంచీ అనుకుంటుండే జరుగుతోంది నేచురల్ స్టార్ నాని(Nani) హాయ్..నాన్న(Hi Nanna) సినిమా విషయంలో. డిసెంబర్ నెలలో వరుసగా పెద్ద సినిమాలు విడుదల.. వాటి మధ్యలో ఓ మోస్తరు సినిమాలు అంటే మీడియం రేంజి సినిమాలు నిలదొక్కుకోవాలంటే కష్టమే అని సినీ విశ్లేషకులు అంటూ వచ్చారు. అలానే జరిగింది. మొదటి వారంలో వచ్చిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తూ పోతోంది. వరుసగా కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సినిమాకి ఇచ్చిన స్క్రీన్స్ ఖాళీ కాకుండానే, నాని హాయ్ నాన్న వచ్చింది. సరిగ్గా ఒకరోజు తరువాత నితిన్ ఎక్స్ట్రార్డనరీ గా వచ్చేశాడు. దీంతో స్క్రీన్స్ సర్దుబాటు కాలేదు. నాన్న సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా.. దానికి అనుగుణంగా స్క్రీన్స్ లేకపోవడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది.

యానిమల్ సినిమా ఇప్పటికీ డిమాండ్ ఉండడంతో స్క్రీన్స్ తగ్గించలేదు. దీంతో నాన్న (Nani Movie) కి డిమాండ్ ఉన్నప్పటికీ స్క్రీన్స్ పెంచే పరిస్థితి లేదు. వాస్తవానికి నాన్న సినిమాకు మంచి ఓపెనింగ్ దక్కలేదనే చెప్పాలి. పది కోట్లకు పైగా గ్రాస్ వచ్చినా అది నాని కెరీర్ లో పెద్ద గ్రాస్ గా చెప్పలేం. ఇక వీకెండ్ లో నాని సినిమాకి స్క్రీన్స్ దక్కకపోవడంతో మంచి టాక్ వచ్చినా సినిమాకి ప్లస్ కాలేదని అంటున్నారు. అంతేకాకుండా నాన్న సినిమాకి 80 శాతానికి పైగా అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నప్పటికీ.. స్క్రీన్స్ పెంచకపోవడం పాటల ఫ్యాన్స్ కూడా సంతోషంగా లేరు. థియేటర్ ఆక్యుపెన్సీ ఫుల్ గా ఉండేలా పరిస్థితి ఉన్నా.. నాన్న సినిమాకి అన్యాయమే జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి యానిమల్ సినిమా కలెక్షన్స్ కొంత డ్రాప్ అయినా కూడా థియేటర్లను వదలడం లేదు. దీని వెనుక ఏమి జరుగుతుంది అనే దానిపై ఫ్యాన్స్ కాంప్లయింట్స్ అయితే చాలానే ఉన్నాయి. గతంలో కూడా చాలా సినిమాల విషయంలో థియేటర్లను గుప్పెట్లో పెట్టుకున్న కొంతమంది వలన హిట్ సినిమాలు కూడా ఎవరేజ్ కలెక్షన్లతో సరిపెట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ వీకెండ్ కీలకమైనది నాన్న (Nani Movie)సినిమాకి. కానీ, ఆ అవకాశం పోయింది. వచ్చే వీకెండ్ కి సలార్ హీట్ స్టార్ట్ అయిపోతుంది. దాంతో పాటు షారూక్ డింకీ సినిమా కూడా ఉందనే ఉంది. ఇక వచ్చే వారం అయినా నానీకి థియేటర్లు దక్కకపోతే, కలెక్షన్స్ పరంగా హాయ్.. నాన్న (Nani Movie)నిలబడిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. యానిమల్ సినిమా కన్నా చాలా తక్కువగా హాయ్.. నాన్నకు థియేటర్లు ఉండడం.

Also Read: బాలీవుడ్ బాద్ షా కు సలార్ టెన్షన్.. గట్టి దెబ్బే!

ఇదిలా ఉంటే.. ఓవర్సీస్ లో నానీ (Nani Movie)మళ్ళీ మిలియన్ బాదాడు. వరుసగా నానీ నటించిన 9 వ సినిమా మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది ఓవర్సీస్ లో. ఇది ఒక రికార్డు. ఇప్పటివరకూ ఏ మీడియం రేంజ్ హీరోకు ఇలా వరుసగా 9 సినిమాలు మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరటం జరగలేదు. కాగా మహేష్ బాబు 11 సినిమాలు మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్నాయి. మహేష్ తరువాత నాని నిలిచాడు. నాని నటించిన ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్, MCA, నిన్ను కోరి, జెర్సీ, అంటే సుందరానికి, దసరా సినిమాలు వరుసగా మిలియన్ డాలర్ల క్లబ్ లో ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన హాయ్.. నాన్న చేరింది. నాన్న సినిమా ఇప్పటికే మిలియన్ డాలర్లు దాటేయడంతో రెండు మిలియన్ కొట్టడం పెద్ద కష్టం కాదు అంటున్నారు సినీ జనాలు. చూద్దాం ఏమి జరుగుతుందో!

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు