/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-94-2-jpg.webp)
Hi Nanna: తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషన్స్ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం హాయ్ నాన్న. నేచురల్ స్టార్ నాని (Nani), సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాతో డైరెక్టర్ గా శౌర్యువ్ పరిచయమవుతున్నారు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా 'హాయ్ నాన్న' చిత్రం ట్రైలర్ ను సినిమా బృందం విడుదల చేసింది.
తల్లి లేని బిడ్డ జీవితం కథాంశంగా చిత్రాన్ని నిర్మించినట్లు అర్థమవుతోంది. ఆ బిడ్డ జీవితంలో లోటు ఎలాంటిది, దాన్ని తెలియకుండా నాన్న ఎలా పెంచాడు... అన్నది ప్రధాన కథాంశం. నాని ఎమోషనల్ సీన్స్ ను పండించాడు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. డిసెంబర్ 7న ఈ సినిమా థియేటర్లలో విడుదలవబోతోంది.