రజనీకాంత్ సినిమాలో నాని?

New Update
రజనీకాంత్ సినిమాలో నాని?

రజనీకాంత్ “జైలర్” ఆగస్ట్ 10న విడుదల కానుంది. మరోవైపు “జై భీం” ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సూపర్ స్టార్ సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాలో నాని అతిధి పాత్రలో కనిపించడానికి అంగీకరించాడని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్‌గా నానిని సంప్రదించిన దర్శకుడు కథ, పాత్ర గురించి చెప్పాడు. గతంలో 2 తమిళ సినిమాల్లో నటించిన నాని, రజనీకాంత్‌తో నటించే అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ చిత్రంలో నాని 20 నిమిషాలకు పైగా నిడివిగల పాత్రలో నటించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. జైభీమ్ తరహాలోనే బలమైన సామాజిక సందేశంతో ఈ సినిమా రాబోతోంది. రజనీకాంత్ లాంటి స్టార్ హీరోనే అలాంటి సందేశం ఇవ్వాలనేది జ్ఞానవేల్ కోరిక.

ప్రస్తుతం నాని ‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తున్నాడు. “హాయ్ నాన్నా” సినిమా పూర్తయిన తర్వాత అతను రజనీకాంత్ సినిమాని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు బయటకు రాబోతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు