మహిళపై వైసీపీ ఎంపీ అనుచరుల దౌర్జన్యం ఏపీలో మహిళలకు రక్షణ లేదని ప్రతిపక్షాలు ఓ పక్క విమర్శిస్తూనే ఉంటున్నాయి. అయితే తాజాగా నంద్యాల జిల్లాలో ఓ మహిళపై వైసీపీ నేత బంధువులు దాడి చేశారు. పొలం కౌలు విషయంలో దంపతులపై దాడి చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. By Vijaya Nimma 10 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి మహిళపై వైసీపీ నేతల దాడులు నంద్యాల ఎంపీ వైసీపీ నేత పోచా బ్రహ్మానందరెడ్డి బంధువు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డికి చెందిన ఐదెకరాల భూమిని నంద్యాల మండలం వెంకటేశ్వరపురం గ్రామానికి శేషన్న, అంకాలమ్మ దంపతులు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేస్తున్నారు. కౌలు బకాయి చెల్లించాలంటూ ఎంపీ అనుచరులు పొలం దగ్గర హల్‌చల్ చేశారని భూమిని కౌలుకు తీసుకున్న మహిళ వాపోయారు. ట్రాక్టరుతో ఐదెకరాల్లో మొక్కజొన్న పైరును దున్నివేశారని చెప్పి కన్నీటిపర్యంతమయ్యారు. అడ్డు వచ్చిన తనపైనా దాడి చేశారని అంకాలమ్మ చెబుతున్నారు. కౌలు రైతు దంపతులకు గాయాలు అయితే నిన్న జనసేనని అధ్యక్షుడు విజయయాత్రలో కౌలు రైతుల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. తను కష్టపడి సినిమాల్లో నటించి, వచ్చిన డబ్బుని పేదలకు, కౌలు రైతులకు పంచుతున్నానని పవన్ అన్నారు. మంచి చేసేవాడు ఎక్కడ ఉంటే ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని.. కౌలు రైతులకు చేసింది ఏం లేదని.. మీరు డబ్బులు నొక్కేయడం తప్ప.. పేదలకి చేసిందేమి లేదన్నారు. ఈ ఘర్షణలో కౌలు రైతు దంపతులకు గాయాలయ్యాయి. వారు నంద్యాల ప్రభుత్వాస్పపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాపాడవల్సిన అధికార నాయకులే.. ఇలా దాడులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో సీఎంకి విజ్ఞప్తి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతుల పరిస్థితి మరి దారుణంగా తయారైందని రైతు సంఘం నేతలు విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కౌలు రైతుకి అన్ని పథకాలు దక్కేలా చేశారని.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాలను రద్దు చేయడంతో కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గతంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలంటూ భూ పరిపాలన శాఖ ప్రధాన కార్యాలయం వద్ద రైతు సంఘం, కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ర్యాలీలో పోలీసులు, కౌలు రైతుల మధ్య తోపులాట జరిగినా.. రైతులు వెనక్కి మాత్రం తగ్గలేదు. కౌలు రైతులకు నిబంధన వల్ల పంట నష్ట పరిహారాలన్నీ భూ యజమానుల ఖాతాలోకి వెళ్లిపోతున్నాయని కష్టపడి శ్రమించి నష్టపోతున్న కౌలు రైతుకి ఒక రూపాయి కూడా దక్కటం లేదని కౌలు రైతు సంఘం నేతలు వెల్లడించారు. జగన్ ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారి గతంలోనే డిమాండ్ చేశారు. కౌలు రైతుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేసిన ఎలాంటి న్యాయం జరగలేదని వాపోతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి