Missing Case : మైనర్ బాలిక మిస్సింగ్ మిస్టరీ కేసు.. నిందితులంతా మైనర్లే! ఏపీలోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 9ఏళ్ల మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు మైనర్ అబ్బాయిలు హత్యాచారం చేసి అమ్మాయిని చేతులతో గొంతు నులుమి చంపివేసినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. By srinivas 16 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Nandyala : ఏపీ (Andhra Pradesh) లోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 9ఏళ్ల మైనర్ బాలిక (Minor Girl) మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు మైనర్ అబ్బాయిలు హత్యాచారం చేసి అమ్మాయిని చేతులతో గొంతు నులుమి చంపివేసినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తండ్రుల సహాయంతో రాయి కట్టి.. ఈ మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ.. మైనర్ బాలిక మిస్సింగ్ మిస్టరీ కేసులో ముగ్గురు బాలురులను అదుపులోనికి తీసుకొని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశాం. ఈ నెల 7న ముచ్చుమర్రి గ్రామం నుంచి 9ఏళ్ల బాలిక అడుకోవటానికి పార్కుకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తండ్రి సంగెం చిన్న మద్దిలేటి, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దానిపై అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేశాం. అప్పటినుండి మైనర్ బాలిక ఆచూకీ కోసం సెర్చ్ అపర్షన్ నిర్వహించాం. విచారణలో ముగ్గురు మైనర్ బాలురు బాలికపై అత్యాచారం చేసి చంపి కొంత దూరం సైకిల్ పై, మరికొంత దూరం బైక్ పై డెడ్ బాడీ తీసుకెళ్లి కృష్ణానది బ్యాక్ వాటర్ లో వారి తండ్రుల సహాయంతో రాయి కట్టి నదిలో పడవేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలీంది. గజ ఈత గాళ్లు, SDRF, NDRF టీమ్ లు ఆరు స్పెషల్ పార్టీ బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, టెక్నికల్ టీమ్ లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టినా మైనర్ బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. ముగ్గురు మైనర్ బాలురను వారి తల్లి తండ్రులను అదుపులోనికి తీసుకుని విచారించగా శవాన్ని నదిలో పడవేసినట్లుగా ఒప్పుకున్నారు. నిందుతులు యోహన్, బొల్లెద్దుల, సద్గురుడులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. Also Read : నాలుగో పెళ్లి చేసుకున్న దొంగమొగుడు.. విడాకులు కావాలంటున్న మూడో భార్య..! #9-year-old-minor-girl #nandyala-muchumarri #missing-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి