Nandamuri Mokshagna : నందమూరి వారసుడి డెడికేషన్.. 5 నెలల్లోనే అన్ని కేజీల బరువు తగ్గిన మోక్షజ్ఞ

నందమూరి మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీ కోసం భారీగా కష్టపడ్డారట. గతంలో చాలా లావుగా ఉండే మోక్షజ్ఞ, హీరో కటౌట్ కోసం 18 కేజీలు తగ్గాడు. అదికూడా కేవలం 5 నెలల్లోనే. దీంతో మోక్షు డెడికేషన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ డెబ్యూ మూవీని తెరకెక్కించనున్నారు.

Nandamuri Mokshagna : నందమూరి వారసుడి డెడికేషన్.. 5 నెలల్లోనే అన్ని కేజీల బరువు తగ్గిన మోక్షజ్ఞ
New Update

Nandamuri Mokshagna : నందమూరి బాలకృష్ణ వారసుడి మూవీ ఎంట్రీపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ‘హనుమాన్’ మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్నాడు. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా అతని ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మోక్షజ్ఙ అదిరిపోయాడు. సూపర్ స్టైలిష్ లుక్ తో నందమూరి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు.

అయితే ఈ లుక్ కోసం మోక్షు ఏకంగా 5 నెలల కష్టపడ్డాడట. గతంలో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండేవాడు. అతని ఫొటోలు బయటకు రావడంతో అసలు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా? రాడా? అనే సందేహాలు కూడా ఆ మధ్య వచ్చాయి. ఫ్యాన్స్ కూడా అతన్ని చూసి మోక్షు హీరోగా పనికిరాడని ఫిక్స్ అయిపోయారు.


Also Read : ఓటీటీలోకి రూ.500 కోట్ల హర్రర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

అయితే మోక్షజ్ఞ వీటన్నిటినీ పటా పంచలు చేస్తూ హీరోకు ఉండాల్సిన పర్‌ఫెక్ట్ కటౌట్ తో ఎంట్రీ ఇచ్చి అందర్నీ షాక్ కు గురి చేసాడు. హీరో కటౌట్‌లోకి రావడానికి దాదాపు 18 కేజీలు తగ్గాడు. అదికూడా కేవలం 5 నెలల్లోనే. దీంతో మోక్షు డెడికేషన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందనున్న ఈ సినిమా మైథలాజికల్ జోనర్ లో ఉండబోతుంది.

#nandamuri-mokshagna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe