Kalyan Ram : కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్.. 'బింబిసార' ప్రీక్వెల్ తో పాటూ మరో సినిమా అనౌన్స్ మెంట్!

కళ్యాణ్ రామ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన న్యూ ప్రాజెక్ట్స్ కు సంబంధించి మేకర్స్ బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ ఇచ్చారు. ఇందులో 'బింబిసార' సీక్వెల్ అనౌన్స్ మెంట్ సైతం ఉండటం విశేషం. మరోచిత్రం '#NKR21' ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు.

New Update
Kalyan Ram : కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్.. 'బింబిసార' ప్రీక్వెల్ తో పాటూ మరో సినిమా అనౌన్స్ మెంట్!

Nandamuri Kalyan Ram Birthday Special Movie Updates :నందమూరి హీరోల్లో ఒకడైన కళ్యాణ్ రామ్ నేడు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా (Social Media) వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. మరోవైపు కళ్యాణ్ రామ్ (Kalyan Ram) న్యూ ప్రాజెక్ట్స్ కు సంబంధించి మేకర్స్ బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ ఇచ్చారు. ఇందులో 'బింబిసార' సీక్వెల్ అనౌన్స్ మెంట్ సైతం ఉండటం విశేషం.

ప్రీక్వెల్ గా...

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ 'బింబిసార' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో ఈ సినిమాకు పార్ట్‌-2 రానుందని గతంలోనే ప్రకటించారు. నేడు కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్‌ కీలక ప్రకటన చేశారు. మొదటి పార్ట్‌కు ప్రీక్వెల్‌గా రెండో భాగం రానున్నట్లు చెప్పారు. ఫస్ట్‌ పార్ట్‌కు వశిష్ఠ దర్శకత్వం వహించగా.. రెండో పార్ట్‌కు మాత్రం అనిల్ పాదూరి దర్శకత్వ ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు '#NKR22' అనే టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read : రజినీకాంత్ తో మోహన్ బాబు ఫొటో.. అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చిన కలెక్షన్ కింగ్, వైరల్ అవుతున్న పిక్!

మరో కొత్త డైరెక్టర్ తో...

కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్న మరోచిత్రం '#NKR21' ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన సరసన సయీ మంజ్రేకర్‌ (Saiee Manjrekar) హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు