Balakrishna To Be Cabinet Minister: ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి కేంద్రంలో ఎన్డీఏ కూటమి సమావేశాలు, ప్రమాణ స్వీకారం, రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొనడం తదితర కార్యక్రమాలతో చంద్రబాబు (Chandrababu) నిన్న రాత్రి వరకు బిజీగా ఉన్నారు. నిన్న మోదీతో పాటు కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం ముగియడంతో చంద్రబాబు ఈ రోజు విజయవాడకు చేరుకున్నారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. దీంతో ఆయన కేబినెట్ లోకి ఎవరిని తీసుకుంటారు? కాబోయే మంత్రులు ఎవరు? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. హిందూపూర్ నుంచి వరుసగా మూడు సార్లు విజయం అందుకున్న బాలకృష్ణకు మంత్రి పదవి దక్కడం ఖాయమంటూ ప్రచారం సాగుతోంది.
పూర్తిగా చదవండి..Balakrishna: కేబినెట్ లో బాలయ్య.. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ విజయం అందుకున్న బాలకృష్ణకు మంత్రి పదవి దక్కడం ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. పార్టీలో సీనియర్ కావడం, ఎన్టీఆర్ కుమారుడు ఇలా అన్ని అంశాలు ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Translate this News: