BREAKING: TSPSC కేసులో నిందితులకు షాక్

TSPSC పేపర్ లీకేజి కేసులో నిందితులకు షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో నిందితులకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏడుగురిని వెంటనే అదుపులోకి తీసుకొవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.

New Update
BREAKING: TSPSC కేసులో నిందితులకు షాక్

TSPSC PAPER LEAK CASE: తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన టీఎస్పీఎసీ పేపర్ లీకేజి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో ఒకేసారి ఏడుగురు నిందితులకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏడుగురిని వెంటనే అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరు పరచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.

ALSO READ:  నాలుగు రోజులు ఇంటర్ కాలేజీలు బంద్!

శుక్రవారం రోజున ముద్దాయిందరినీ ఎగ్జామినేషన్ కొరకు హాజరు కావాల్సిందిగా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా ఈరోజు జరిగే విచారణకు నిందితులు A17, 18, 23, 25, 27, 28, A37 హాజరు కాలేదు. విచారణకు రావడం లేదని నిందితులు గైర్హాజరు పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే నిందితులుకు అనుమతి నిరాకరిస్తూ ఆ ఏడుగురిపై నాంపల్లి హైకోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది.

                                                                      NEWS IS BEING UPDATED

Advertisment
Advertisment
తాజా కథనాలు