Namibia President: నమీబియా(Namibia) దేశా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ (Hez Gingobe) ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు ఆ దేశ అధికారిక సంస్థలు వెల్లడించాయి. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ (Cancer) తో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటూ ఆయన ఆదివారం ఉదయం కన్నుమూసినట్లు తెలిపారు. ఆయన గత నెలాఖరులో వైద్య పరీక్షల కోసం యూఎస్ కు వెళ్తున్నట్లు తెలిపారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజున నమీబియా అధ్యక్షుడు మరణించడం విషాదాకరం. గెంగోబ్ విండ్ హోక్ లోని లేడీ పోహంబా ఆసుప్రతిలో గింగోబ్ మరణించారు. 2014లోనే ఆయన ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఓ సారి ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి బయటపడినట్లు గింగోబ్ తన దేశ ప్రజలకు చెప్పారు.
గింగోబ్ ఆకస్మిక మరణం పట్ల రాజకీయ నాయకులతో పాటు సామాన్యులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే గింగోబ్ మరణించారు.
Also read: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!