/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cmcmccm.jpg)
Krishna Kumari: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్(Prem Singh Tamang) సతీమణి కృష్ణ కుమారి రాయ్(Krishna Kumari Rai) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన 24 గంట్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదించినట్లు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ అధికారికంగా ప్రకటించారు.
సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో..
ఇక తన భార్య రాజీనామాపై స్పందించిన సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ‘నా జీవిత భాగస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించింది. (సిక్కిం క్రాంతికారి మోర్చా) ఎస్‌కేఎం పార్టీ పార్లమెంటరీ కమిటీ అభ్యర్థన మేరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో ఆమె తన పదవి నుంచి వైదొలగినట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా. ఆమె మాకు ఇచ్చిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నామ్చి-సింగితాంగ్(Namchi-Singhithang) నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల నియమావళి 1961 సెక్షన్ 67/A ప్రకారం రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ఫలితాలు ప్రకటించిన 14 రోజులలోపు ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.