Lok Sabha Elections : ఖమ్మం లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు! ఖమ్మం లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. By srinivas 04 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Nama Nageswara Rao - Khammam MP Candidate: ఖమ్మం లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అధికారికంగా ప్రకటించారు. అసలైన పరీక్ష.. ఈ మేరకు రెండు దఫాలు లోక్‌సభ పక్షనేతగా పనిచేసిన నామా నాగేశ్వరరావు 2024 పార్లమెంటు ఎన్నికల్లో అసలైన పరీక్షను ఎదుర్కోబోతున్నారనే చర్చ జరుగుతోంది. 2009, 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానానికి తిరుగులేని విజయాలను నమోదు చేసినప్పటికీ ఈసారి గెలుపు అంతఈజీ కాదంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పూర్తిగా కాంగ్రెస్ వశమైపోగా.. లోక్ సభ ఎన్నికల్లోనూ బీఆర్ ఎస్ (BRS) గెలవడం కష్టసాధ్యంగానే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పొంగులేటి, తుమ్మల ప్రభావం ఉంటుందని, కాబట్టి నామా మోజారిటీ సాధించడం అనుకున్నంత సులభం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: Crime: భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త.. పసి బిడ్డను చూడకుండా దారుణం! ఎవరిని బరిలో నిలిపినా ఒకే.. ఇక ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన నామా.. పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించాలంటే అది బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని అన్నారు. దేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువసార్లు తెలంగాణ గురించి లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రశ్నించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని అమలుకు సాధ్యంకాని హామీలిచ్చిందని, ఇప్పుడు వాటిని ఎలా అమలు చేయాలో తెలియక తలలు పట్టుకుంటుందని విమర్శించారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. వందరోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారని, పార్లమెంట్ షెడ్యూల్‌లోపే వాటిని అమలు చేయాలని ప్రజలు నిలదీయాలని ప్రజలకు సూచించారు. జాప్యంపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ఎంపీలతోనే తెలంగాణ సమస్యలకు జాతీయ స్థాయిలో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఖమ్మం లోక్‌సభ నుంచి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరిని లోక్‌సభ బరిలో నిలిపినా కలిసి పనిచేస్తామన్నారు. #lok-sabha-elections-2024 #nama-nageswara-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి