Nallamilli: అనపర్తిలో బిగ్‌ ట్విస్ట్‌.. బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బిగ్‌ ట్విస్ట్‌ నెలకొంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలోకి చేరనున్నారని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా అనపర్తి బరిలోకి దిగనున్నారు. పార్టీ పెద్దల నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

New Update
Nallamilli: అనపర్తిలో బిగ్‌ ట్విస్ట్‌.. బీజేపీలోకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

Nallamilli Ramakrishna Reddy: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బిగ్‌ ట్విస్ట్‌ నెలకొంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలోకి చేరనున్నారని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా అనపర్తి బరిలోకి దిగనున్నారు. ఈ విషయంపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. కొద్దిరోజులుగా బీజేపీలోకి రావాలని తనకు ఆహ్వానం అందిందన్నారు. అయితే, పోటీ అంటూ చేస్తే టీడీపీ నుండే చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.

Also Read: టీడీపీ అభ్యర్థి దౌర్జన్యం.. RTV ప్రతినిధిపై దాడి..!

అయితే, నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు తనతో ఫోన్‌లో మాట్లాడారన్నారు. వైసీపీ నుండి విముక్తి కావాలంటే జెండా ఏదైనా కూటమి గెలవాలన్నారు. చంద్రబాబు సూచనతోనే బీజేపీలోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. పార్టీ పెద్దల నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు