Naked Football Match: ప్రపంచంలో నిత్యం ప్రజలకు నచ్చని ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పాలకులు తీసుకొచ్చే చట్టాలు.. వాటిలో మార్పులు.. వివిధ వర్గాలపై పెరిగిపోతున్న వివక్ష.. స్థానికంగా ఉండే సమస్యలు.. ఇలా రకరకాల కారణాలతో ప్రజలు ఎప్పుడూ అసంతృప్తితో ఉంటారు. కొందరు తమ అసంతృప్తిని తమలోనే అణచిపెట్టుకుని జీవితాన్ని లాగించేస్తారు. మరికొందరు తమ అసహనాన్ని ఎదుటి వ్యక్తులపై, వ్యవస్థలపై చూపించడానికి ఏమాత్రం వెనుకాడరు. అయితే, అందరూ ఒకేలా తమ వాహనాన్ని వెల్లడించరు. రకరకాల విధానాల్లో వ్యక్త పరుస్తూ ఉంటారు. వాటిలో కొన్ని వింతగా కూడా ఉంటాయి. సరిగ్గా లాంటి సంఘటనే.. అంటే అలాని విచిత్ర నిరసన కార్యక్రమం ఒకటి చోటు చేసుకుంది.
Naked Football Match: క్రీడలను వ్యాపార సాధానాలుగా మార్చేస్తున్న పరిస్థితులపై కొందరు ఫుట్ బాల్ ఆటగాళ్లకు కోపం వచ్చింది. తమ కోపాన్నీ, అసహనాన్నీ, వ్యక్తపరచడానికి ఒక కొత్త పధ్ధతిలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు. బట్టలు వేసుకున్న జట్టు.. బట్టలు లేకుండా ఉన్న జట్టు.. ఈరెండిటి మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహించారు. జర్మనీలోని హెర్న్ నగరంలో ఈ మ్యాచ్ జరిగింది. పొట్టోరిజినాలే ఆల్ స్టార్స్ అనే జట్టు ఒక ఫుట్ బాల్ మ్యాచ్(Naked Football Match) లో దుస్తులు ధరించిన టీమ్-పూర్తిగా బట్టలు లేకుండా ఒక టీమ్ గా విడిపోయి పోటీ పడింది. ఒక జట్టులో సభ్యులు అందరూ పూర్తి దుస్తులు ధరించి ప్రొఫెషనల్ గా ఎప్పటిలానే ఆ మ్యాచ్ లో పాల్గొన్నారు. అయితే, మరో టీమ్ కేవలం సాక్స్, షూస్ మాత్రమే ధరించి మ్యాచ్ ఆడారు. వీపులపై తమ పేరును పెయింట్ చేసుకుని, ఛాతీపై తమ జెర్సీ నెంబర్ పెయింట్ చేసుకుని ఈ మ్యాచ్ లో పాల్గొన్నారు.
సోషల్ మీడియా వేదిక X గతంలో ట్విట్టర్ లో "The NEXTA" అనే పేరుతో ఒక పోస్ట్ కనిపించింది. ఇందులో ఈ కొత్త తరహా ఫుట్ బాల్ (Naked Football Match) మ్యాచ్ దర్శనం ఇచ్చింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దేనికి చాలామంది స్పందిస్తున్నారు. “ఎప్పుడో వందేళ్ల క్రితమే ఫుట్ బాల్ కమర్షియల్ అయిపొయింది. ఇంత లేటుగా అయినా పోరాటం మొదలు పెట్టినందుకు అభినందనలు” అంటూ ఒక యూజర్ స్పందించాడు. ఇక కొంతమంది దీనిపై హాస్యభరితంగా స్పందించారు. ఒకాయన “అమ్మాయిల మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నా” అంటూ కామెంట్ పెట్టారు.