నాగర్ కర్నూల్ జిల్లా ( Nagar Kurnool) అమ్రాబాద్ మండల కేంద్రంలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ( MLA Guvwala Balaraju) తో కలిసి హరితహారం మొక్కలు నాటేరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula Iswar). మన కేంద్రంలో ముస్లిం మైనార్టీలకు కమ్యూనిటీ హాల్, మైనార్టీ స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి, మజీద్ మరమ్మతులకు 30 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేశారు.
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ అమ్రాబాద్ పదర మండలాలు ఎంతో ఎత్తయిన ప్రదేశంలో ఉన్నాయి వారికి సాగునీరు అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ( cm kcr) టెండర్ ప్రక్రియలో ఉన్నాయని అన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ శాతం దళితులు బడుగు బలహీన వర్గాల వరకు చెందినవారు ఉంటారు కాబట్టి.. పెద్దన్నతో సమానులు అన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రి చేరువతో పూర్తిస్థాయిలో దళిత బంధు ప్రకటించాలని కోరారు. వెంటనే మంత్రి సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి పూర్తిస్థాయిలో దళిత బంధు ప్రకటించే విధంగా చొరవ తీసుకుంటానని అన్నారు.
ఎన్నికలు రాగానే గ్రామాలకు మాయమాటలు చెప్పడానికి వస్తుంటారు. వారు మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్- బీజేపీ ( Congress-BJP) పాలిస్తున్న ప్రాంతాలలో దళిత బంధు, కల్యాణలక్ష్మి ,షాది ముబారక్, 24 గంటల ఉచిత కరెంట్ (Free current), నాలుగు వేల పెన్షన్ ఇచ్చి అప్పుడు తెలంగాణలో హామీలు ఇవ్వాలని కాంగ్రెస్ -బీజేపీ నాయకులపై మండిపడ్డారు. అన్ని తానై చేస్తున్న ముఖ్యమంత్రిని మరోసారి ఆదరించాలని, వినాయకుడు ప్రతినిత్యం ప్రజల ఉంటూ అభివృద్ధి చేస్తున్న మీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును మరోసారి ఆదరించి గెలిపించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అచ్చంపేట (Atchampeta) పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.