/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T164413.765.jpg)
Naga Chaitanya Drives Prabhas Bujji :'కల్కి' సినిమా కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఓ ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. ఆ వాహనానికి బుజ్జి అనే పేరు పెట్టి కథలో ఈ బుజ్జి (Bujji) చాల కీలకమని తెలుపుతూ ప్రత్యేకంగా ఆ బుజ్జిని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు. ఇందుకోసం ఇటీవల రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) లో ఓ భారీ ఈవెంట్ నిర్వహించగా.. ప్రభాస్ (Prabhas) స్వయంగా బుజ్జిని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి స్టేజ్ పై ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
ఎప్పుడైతే బుజ్జి, భైరవ పాత్రల్ని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశారో అప్పట్నుంచి కల్కి మూవీపై ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో ప్రభాస్ బుజ్జిని తాజాగా అక్కినేని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) నడిపాడు. ఈ వాహనాన్ని చూసి ఆశ్చర్యపోయిన చైతు ఇంజనీరింగ్‌లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ దీనిని తయారు చేశారా అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.
నాగచైతన్య బుజ్జిని డ్రైవ్ చేసిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. ఇక కల్కి మూవీ విషయానికొస్తే.. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ సినిమాని 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Look who's met #Bujji... @chay_akkineni, hope you had a fantastic time.#Kalki2898AD#Prabhas@SrBachchan@ikamalhaasan@deepikapadukone@nagashwin7@DishPatani@Music_Santhosh@VyjayanthiFilms@Kalki2898AD@BelikeBujji@saregamaglobal@saregamasouth#Kalki2898ADonJune27pic.twitter.com/8odhpYDqMz
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 25, 2024
Also Read : వరుస హత్యలు వెనుక మిస్టరీ ఏంటి..? థ్రిల్లింగ్ గా ‘యేవమ్’ టీజర్
Follow Us