Naga Babu Re-Entry In Twitter : ఏపీ అసెంబ్లీ ఎన్నికల(AP Assembly Elections) తర్వాత జనసేన(Janasena) ప్రధాన కార్యదర్శి నాగబాబు(Naga Babu) అల్లు అర్జున్(Allu Arjun) ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ అంతా ప్రచారం చేయగా... అదే సమయంలో స్టార్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పకు మద్దతుగా ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో మెగా అభిమానులతో పాటు టీడీపీ, జనసేన నాయకులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Also Read : సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన దర్శకులు!
ఇక ఎన్నికల తర్వాత నాగబాబు అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే అంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నాగబాబు టార్గెట్ గా అల్లు అభిమానులు విపరీతంగా ట్వీట్లు చేస్తూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇక ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ ను డియాక్టివేట్ చేశారు.
అయితే తాజాగా నాగబాబు నా ట్వీట్ డిలీట్ చేశానంటూ పోస్ట్ పెట్టారు. దీంతో బన్నీ విషయంలో నాగబాబు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. దీంతో బన్నీ విషయంలో నాగబాబు వెనక్కి తగినట్లు తెలుస్తోంది.