Naga Babu Re-Entry In Twitter : ఏపీ అసెంబ్లీ ఎన్నికల(AP Assembly Elections) తర్వాత జనసేన(Janasena) ప్రధాన కార్యదర్శి నాగబాబు(Naga Babu) అల్లు అర్జున్(Allu Arjun) ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ అంతా ప్రచారం చేయగా… అదే సమయంలో స్టార్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పకు మద్దతుగా ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో మెగా అభిమానులతో పాటు టీడీపీ, జనసేన నాయకులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Naga Babu : ట్విట్టర్ లోకి నాగబాబు రీ ఎంట్రీ.. అల్లు అర్జున్ ట్వీట్ పై ఏమన్నారంటే..?
ఏపీ ఎన్నికల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ నెట్టింట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా నాగబాబు నా ట్వీట్ డిలీట్ చేశానంటూ పోస్ట్ పెట్టారు. దీంతో బన్నీ విషయంలో నాగబాబు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
Translate this News: