Naga Babu : ట్విట్టర్ లోకి నాగబాబు రీ ఎంట్రీ.. అల్లు అర్జున్ ట్వీట్ పై ఏమన్నారంటే..?

ఏపీ ఎన్నికల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ నెట్టింట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా నాగబాబు నా ట్వీట్ డిలీట్ చేశానంటూ పోస్ట్‌ పెట్టారు. దీంతో బన్నీ విషయంలో నాగబాబు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.

New Update
Naga Babu : ట్విట్టర్ లోకి నాగబాబు రీ ఎంట్రీ.. అల్లు అర్జున్ ట్వీట్ పై ఏమన్నారంటే..?

Naga Babu Re-Entry In Twitter : ఏపీ అసెంబ్లీ ఎన్నికల(AP Assembly Elections) తర్వాత జనసేన(Janasena) ప్రధాన కార్యదర్శి నాగబాబు(Naga Babu) అల్లు అర్జున్(Allu Arjun) ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ అంతా ప్రచారం చేయగా...  అదే సమయంలో స్టార్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పకు మద్దతుగా ప్రచారం చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో మెగా అభిమానులతో పాటు టీడీపీ, జనసేన నాయకులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Also Read : సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన దర్శకులు!

ఇక ఎన్నికల తర్వాత నాగబాబు అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే అంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నాగబాబు టార్గెట్ గా అల్లు అభిమానులు విపరీతంగా ట్వీట్లు చేస్తూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇక ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ ను డియాక్టివేట్ చేశారు.

అయితే తాజాగా నాగబాబు నా ట్వీట్ డిలీట్ చేశానంటూ పోస్ట్‌ పెట్టారు. దీంతో బన్నీ విషయంలో నాగబాబు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. దీంతో బన్నీ విషయంలో నాగబాబు వెనక్కి తగినట్లు తెలుస్తోంది.

#nagababu-tweet #mega-brother-nagababu-says-sorry #Allu Arjun
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Tourist Family: ఓటీటీలోకి రాజమౌళి ఫేవరేట్ సినిమా ....

Tourist Family: ఓటీటీలోకి రాజమౌళి ఫేవరేట్ సినిమా .. స్ట్రీమింగ్ డేట్ ఇదే

శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. రాజమౌళి సైతం మూవీపై ప్రశంసలు కురిపించారు.

New Update

Tourist Family: శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. రాజమౌళి సైతం మూవీపై ప్రశంసలు కురిపించారు. డెబ్యూ డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఇందులో యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, బక్స్, ఎలాంగో కుమారవేల్, శ్రీజా రవి కీలక పాత్రలు పోషించారు. 

మూవీ స్టోరీ 

శ్రీలంకలో ఆర్థిక పతనం,  COVID సంక్షోభం తర్వాత తమిళనాడుకు అక్రమంగా వలస వెళ్ళిన ధర్మదాస్ (శశికుమార్), అతని భార్య (సిమ్రాన్), వారి ఇద్దరు కుమారుల నేపథ్యంలో సాగే  కుటుంబం కథ ఇది. వారు కొత్త జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నించే క్రమంలో ఆ కుటుంబం ఎదుర్కున్న సవాళ్లు ఈ చిత్రంలో చూపించారు. 

latest-news | cinema-news | telugu-cinema-news

Also Read: This Week Ott: స్టార్ హీరోల సినిమాలతో సందడే సందడి.. ఈ వారం ఓటీటీ సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment