Nagababu: ఆ వ్యాఖ్యల పై నన్ను క్షమించండి.. వైరలవుతున్న నాగ బాబు ట్వీట్

ఆపరేషన్ వాలెంటైన్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నాగాబాబు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. పోలీస్ పాత్ర 5'3 హైట్ ఉన్నవారు చేస్తే సెట్ అవ్వదని అన్నారు. ఓ స్టార్ హీరోని ఉద్దేశించి నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరగగా.. తాజాగా ఆ మాటలను వెనెక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు.

Nagababu: ఆ వ్యాఖ్యల పై నన్ను క్షమించండి.. వైరలవుతున్న నాగ బాబు ట్వీట్
New Update

Nagababu Says Sorry: మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine). ఇండియన్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకల్లో ఆపరేషన్ వాలెంటైన్ లో వరుణ్ తేజ్ (Varun Tej) పాత్ర గురించి మాట్లాడుతూ.. నాగబాబు చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Also RPrabhas Spirit Movie: పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్.. స్పిరిట్ స్టోరీ లైన్ పై సందీప్ వంగా క్లారిటీ

నాగ బాబు కామెంట్స్

పోలీస్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్ అంటే చూడడానికి మంచి హైట్, వెయిట్, ఫిజిక్ తో ఉండాలి. వరుణ్ 6 అడుగులు మూడు అంగుళాలు ఉన్నాడు కాబట్టి బాగా సెట్ అయ్యాడు. ఇలాంటి క్యారెక్టర్స్ 5 అడుగులు 3 అంగుళాలు ఉన్నవారు చేస్తే సెట్ అవ్వదు అని అన్నారు. ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఓ స్టార్ హీరో ఫ్యాన్స్.. తమ హీరోను ఉద్దేశించి నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆయన పై ట్రోలింగ్ (Trolls) మొదలు పెట్టారు. తాజాగా దీని పై స్పందించిన మెగా బ్రదర్ నాగ బాబు.. తన మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెబుతూ.. ఆ మాటలకు ఎవరైనా నొచ్చుకునుంటే క్షమించండి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

publive-image

క్షమాపణలు కోరుతూ నాగబాబు ట్విట్టర్ పోస్ట్

"ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను,ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే I'm Really Very sorry,అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని Wanted గా అన్న మాటలు కాదు,అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను"



Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ 

#nagababu #operation-valentine-movie #varun-tej #nagababu-comments
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి