Naga Chaitanya: ప్రేమ పెళ్లితో దెబ్బతిన్న చై.. తండ్రి మాటకు తలవంచి రెండో పెళ్లి..!! టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నాగ చైతన్యకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే.. సినిమా ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధం లేని ఒక బిజినెస్ మ్యాన్ కుమార్తెను..కోడలిగా చేసుకోవడానికి సిద్దమయ్యారట. ఒకసారి ప్రేమ పెళ్లితో దెబ్బతిన్న చై .. ఈసారి తండ్రి చెప్పిన మాటకు తలవంచి.. రెండో పెళ్ళికి ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 16 Sep 2023 in సినిమా New Update షేర్ చేయండి Naga Chaitanya Second Marriage: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna), నాగ చైతన్యకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే.. సినిమా ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధం లేని ఒక బిజినెస్ మ్యాన్ కుమార్తెను..కోడలిగా చేసుకోవడానికి సిద్దమయ్యారట. ఒకసారి ప్రేమ పెళ్లితో దెబ్బతిన్న చై .. ఈసారి తండ్రి చెప్పిన మాటకు తలవంచి.. రెండో పెళ్ళికి ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చై రెండో పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలియడంతో చై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గతేడాది అక్కినేని నాగచైతన్య.. హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల(Sobhita Dhulipala)తో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వినిపించాయి. అందుకు నిదర్శనంగా వారిద్దరూ విదేశాలలో డేటింగ్ చేస్తూ కనిపించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే చై ఈ రూమర్స్ పై స్పందించింది లేదు. శోభితా మాత్రం అందులో ఎలాంటి నిజం లేదని ఖరాకండీగా చెప్పేసింది. అక్కినేని నాగచైతన్య, సమంత (Samantha) విడిపోయి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది.అయినా వీరికి సంబంధించిన రూమర్ ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. సమంత, చైతూ విడిపోయాక చాలా మంది షాక్ అయ్యారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండే ఈ జంట ఉన్నట్టుంది ఎందుకు విడిపోయారు అని ప్రతి ఒక్కరి మదిలో ప్రశ్న మెదులుతూనే ఉంది. కానీ వీరు విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఎవ్వరికీ తెలియదు. ఈ మధ్యలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. సమంతకు ప్రీతమ్‌తో ఎఫైర్ ఉందని కొందరు అంటే,శోభిత ధూళిపాలను త్వరలో నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఇలా పలు రూమర్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. కానీ అసలు విషయం తెలియలేదు. Also Read : నేను కిందపడ్డ ప్రతిసారి వారు నన్ను.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..!! #sobhita-dhulipala #naga-chaitanya-marriage-with-sobhita-dhulipala #is-naga-chaitanya-getting-married #naga-chaitanya-to-marry-again #naga-chaitanya-getting-married #naga-chaitanya-second-marriage-rumours #naga-chaitanya-second-marriage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి