Chaitanya: రష్మిక డీప్ ఫేక్ వీడియోపై నాగచైతన్య రియాక్షన్‌ ఇదే.!

రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై హీరో నాగచైతన్య స్పందించారు. టెక్నాలజీ ఎలా దుర్వినియోగం అవుతోందో చూస్తుంటే నిరుత్సాహంగా ఉందని అన్నాడు. భవిష్యత్తులో ఈ దుర్వినియోగం ఏ స్థాయికి పోతుందో అని ఆలోచిస్తేనే భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

New Update
Chaitanya: రష్మిక డీప్ ఫేక్ వీడియోపై నాగచైతన్య రియాక్షన్‌ ఇదే.!

Rashmika Mandanna : నేషనల్ క్రష్ నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఏఐ ఆధారంగా తయారుచేసిన ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్టులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది.  బ్రిటీష్ ఇండియన్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ కు చెందిన ఒరిజినల్ వీడియోను రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి నెట్టంట్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది.


బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ  వీడియోపై ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులు సైతం దీనిపై స్పందించారు. ఈ వీడియో పై నటి రష్మిక కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక నటిగా ఉన్నప్పుడు ఇలాంటి జరిగింది కాబట్టి తట్టుకోగలిగానని.. ఒకవేళ తాను స్కూల్లోనో, కాలేజ్‌లోనో ఉన్న రోజుల్లో జరిగి ఉంటే తాను ఏమయ్యేదాన్నో అని ఆవేదన వ్యక్తం చేశారు.

publive-image

టెక్నాలజీను దుర్వినియోగం చేసి ఇలాంటివి చేయడం వల్ల తనకు మాత్రమే నష్టం జరగలేదని.. మనలోని ప్రతి ఒక్కరికీ ఇది హాని చేస్తుందని రష్మిక మందన అభిప్రాయపడ్డారు.  తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య స్పందించాడు.

టెక్నాలజీ ఎలా దుర్వినియోగం అవుతోందో చూస్తుంటే చాలా నిరుత్సాహంగా ఉందని నాగచైతన్య ఆవేదన వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో ఈ దుర్వినియోగం ఏ స్థాయికి పోతుందో అని ఆలోచిస్తేనే భయం కలుగుతోందని అన్నాడు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇలాంటి చర్యల వల్ల బాధితులుగా మారే వారిని రక్షించేందుకు కఠిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు