Nagababu: చంద్రబాబుకు జనసేన అండగా ఉంటుంది: నాగబాబు

ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ, కర్మ మరో మూడు, నాలుగు నెలల్లో తీరిపోతుందని జనసేన నేత నాగబాబు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు, టీడీపీ కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుందన్నారు .

New Update
Nagababu: చంద్రబాబుకు జనసేన అండగా ఉంటుంది: నాగబాబు

Nagababu: ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ, కర్మ మరో మూడు, నాలుగు నెలల్లో తీరిపోతుందని జనసేన నేత నాగబాబు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు, టీడీపీ కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుందన్నారు . చంద్రబాబు అరెస్ట్ తమ అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు పార్టీ నాయకులకు, జనసైనికులకు ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు . టీడీపీ, జనసేన పొత్తును 90శాతం మంది జనసైనికులు స్వాగతిస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మాత్రం పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారన్నారు. అలాగే ఎవరు సీఎం అవ్వాలనే దాని కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఎవరు సీఎం అనేది కాలం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నా కేసులు పెడుతున్నారని.. కేసులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇంకోసారి వైసీపీ నాయకులు ఎవరైనా సరే ప్యాకేజీ అంటే చెప్పుతీసుకుని కొడతామంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు ఉంటుందని బీజేపీతో పొత్తుపైనా త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. జనసేనలో అక్రమార్కులు, కోట్లాది రూపాయలు ఉన్న నాయకులు లేకపోయినా మంచి నేతలు ఉన్నారని వెల్లడించారు. ప్రజా సేవకులకు మాత్రమే ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఇప్పటికే వారాహి యాత్ర రెండు దశలు పూర్తి చేసుకుందని.. రెండు దశల్లో యాత్రకు ప్రజల నుంచి అపురూపమైన స్పందన వచ్చిందన్నారు. త్వరలోనే రాయలసీమలో వారాహి యాత్ర చాలా స్ట్రాంగ్‌గా చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు.

publive-image

మరోవైపు చంద్రబాబు కోడలు, నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణిని తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు రాజమండ్రిలో కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎవరూ, ఎప్పుడూ చూడలేదని ఈ సందర్భంగా బ్రాహ్మణి తెలిపారు.  రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని గంజాయి, డ్రగ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలని ఆమె సూచించారు. స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపిన జనసేన నేతలకు, అండగా నిలబడుతున్న పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

Advertisment
తాజా కథనాలు