Mysterious Sounds : రాత్రివేళ భయంకర శబ్దాలు..చేపల శృంగారమే కారణమా?

అమెరికాలోని టంపా బే ప్రాంతంలో రాత్రివేళ భయంకర శబ్దాలు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు భూమి కంపించిన ఫీలింగ్‌ కలుగుతుంది. దీంతో అక్కడి ప్రజలు రాత్రి అయితే చాలు గజగజా వణికిపోతున్నారు. ఈ శబ్దాలకు అసలు కారణమేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి.

Mysterious Sounds : రాత్రివేళ భయంకర శబ్దాలు..చేపల శృంగారమే కారణమా?
New Update

Mating calls of Black Drum Fish : అది అమెరికా(America) లోని సౌత్‌ టంపా బే(South Tampa Bay) ప్రాంతం. సముద్రానికి చాలా దగ్గరగా ఉండే సిటీ. సముద్రంతో పాటు చెరువులు కూడా ఎక్కువే. ఆ చెరువుల పైనే ఇళ్లు వెలిశాయి. ఎంతో ఆహ్లదంగా ఉండే ప్లేస్ అది. అయితే రాత్రైతే ఆ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకుండదు. పిల్లలు గజగజా వణికిపోతుంటారు. ఉదయమంతా ఎంతో ఆనందంగా గడిపే ప్రజలు రాత్రి రాకూడదని కోరుకుంటారు. ఎందుకంటే రాత్రి సమయం గడుస్తొన్న కొద్దీ ఏవో శబ్దాలు వినిపిస్తుంటాయి. కొన్నిసార్లు గొడలు వైబ్రేట్ అవుతుంటాయి. భూకంపం వచ్చిందానన్న అనుమానం కలిగిలే ఇంట్లో వస్తువులు కదులుతాయి. ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తాయో అంతుబట్టదు. పిల్లలు ఏడవడం మొదలుపెడతారు. తల్లిదండ్రులకు ఎలా ఓదార్చాలో.. ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థంకాదు.

Mating calls of Black Drum Fish బ్లాక్ డ్రమ్ షిఫ్ (ఫైల్)

Also Read : Valentine Week : ఈ హగ్‌ డే రోజున మీ ప్రియమైన వారిని కవితల కౌగిలిలో బంధించేయండి!

ఈ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి?
ఏళ్లు గడుస్తున్నాయి.. అయినా ఈ అంతుచిక్కని శబ్దాల గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. ఇదంతా గ్రహంతరావాసుల పనేనన్న పుకార్లు చాలానే ఉన్నాయి. అమెరికా ప్రజలకు అక్కడ ఏ వింత జరిగినా అది గ్రహంతరావాసులపై తోయ్యడం అలవాటు. అటు సముద్రంలో ఎవరో దొంగలు కావాలనే ఇలా శబ్దాలు చేసి భయపెడుతున్నారని మరికొందరు అంటుంటారు. ఇలా అనేక సిద్ధాంతాలను తెరపైకి వచ్చాయి. దీంతో సైంటిస్టులు, నిపుణులు రంగంలోకి దిగారు. శబ్దం నీటి అడుగు భాగం నుంచి వస్తుందని గుర్తించారు. నీటి అడుగున ఉన్న రహస్య సైనిక స్థావరం నుంచే ఈ శబ్దాలు వస్తున్నాయన్న వాదన పెరిగింది. అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఎందుకో తెలుసుకోవడానికి సారా హీలీ అనే టంపా మహిళ పరిశోధకుల సాయంతో కొన్ని రీసెర్చ్‌లు చేసింది. చివరకు ఓ ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. నీటి అడుగున ఉన్న చేపల శృంగారమే ఈ శబ్దాలకు కారణమని ఓ అంచనాకు వచ్చారు.

Black Drum Fish Sounds

చేపల శృంగారమే కారణం?
నల్ల డ్రమ్ ఫిష్‌(Black Drum Fish) లు కాస్త ఎక్కువగా ఉండే ప్రాంతం టంపా. ఆ చేపలు రాత్రిపూటే(Night Time) ఎక్కువగా శృంగారంలో పాల్గొంటాయి. చేపలు జతకట్టేటప్పుడు తక్కువ ఫ్రీక్వెన్సీ డ్రమ్మింగ్ శబ్దాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. నీటి అడుగున శబ్దాలు సాధారణంగా గాలిలోకి ట్రాన్స్‌ఫర్ అవ్వవు. ఎందుకంటే నీటి డెన్సిటి(సాంద్రత) గాలి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సైన్స్‌ ప్రకారం ఫ్రిక్వెన్సీ తక్కువ ఉంటే డెన్సిటీ ఎక్కువ.. ఫ్రిక్వెన్సీ ఎక్కువ ఉంటే డెన్సిటీ తక్కువ. అంటే ఫ్రిక్వెన్సీ ఈజ్‌ ఇన్‌వర్సిలీ ప్రపొషనల్‌ టు స్కైర్‌ రూట్‌ ఆఫ్‌ డెన్సిటీ అన్నమాట(frequency is inversely proportional to the square root of density of the material).

Frequency

మరో రెండు నెలల్లో క్లారిటీ?
ఇక్కడ మేటరేంటంటే నల్ల డ్రమ్ చేపలు తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను చేస్తాయి. అవి చాలా బాగా ప్రయాణిస్తాయి.. ఎక్కువ దూరం కూడా వెళ్తాయి. ఈ శబ్దాలు నేల , సొరంగాలు లాంటి వివిధ సాంద్రతల గుండా ప్రయాణించి ప్రజల ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. టంపాలో నల్ల డ్రమ్‌ ఫిష్‌ల సంఖ్య పెరిగి ఉండవచ్చు. అందుకే దశాబ్ద కాలంగా రాత్రివేళల్లో ఈ శబ్దాలు పెరిగాయని అంచనా వేస్తున్నారు. 2012 నుంచి ఈ రాత్రిపూట శబ్దాలపై కంప్లైంట్‌లు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీన్ని మరింత నిర్దారించేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. రెండు నెలల పాటు నీటి అడుగున హైడ్రోఫోన్‌లను పెట్టాలని భావిస్తున్నారు.

Tampa Bay టంపా బే (ఫైల్)

Also Read: కంగారులే కప్పు కొట్టేశారు భయ్యా..

WATCH:

#weird-news #america #tampa-bay #black-drum-fish
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి