మత్తు పదార్ధాల డీలర్‌తో వివాహేతర బంధం.. సినీ నిర్మాత షాకింగ్ కామెంట్స్

మత్తు పదార్ధాల డీలర్‌తో నాభార్య నమిత అక్రమ సంబంధం పెట్టుకుంది, ప్రముఖ నిర్మాత చంద్రశేఖర్ ఆరోపణలు..తన భార్య నమితపై సంచలన ఆరోపణలు చేశారు కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్. మత్తు పదార్థాలకు అలవాటు పడటంతో పాటు.. అక్రమ సంబంధం కూడా నెరపుతోందంటూ ఆరోపించారు.

New Update
మత్తు పదార్ధాల డీలర్‌తో వివాహేతర బంధం.. సినీ నిర్మాత షాకింగ్ కామెంట్స్

My wife is married to a drug dealer

ఒకరిపై ఒకరు ఫిర్యాదు

మత్తు పదార్థాల కేసులు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఇటు టాలీవుడ్‌లో కేపీ చౌదరి ప్రకంపనలు సృష్టిస్తుండగా.. అటు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా మత్తు పదార్థాల భూతం పట్టిపీడిస్తోంది. ఈక్రమంలోనే కన్నడ సినీ నిర్మాత చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య నమిత పత్తు పదార్థాలకు భానిస కావడంత పాటు.. అక్రమ సబంధం కూడా నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. అది కూడా తనకు మత్తు పదార్థాల సరఫరా చేసే మత్తు పదార్థాల డీలర్ లక్ష్మీశ్ ప్రభుతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆయన ఆరోపించారు. అంతే కాదు.. వారిపై బెంగళూరులోని చెన్నమ్మనకేరే అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఇంట్లోనే దొరికిపోయారు..

కన్నడ సినిమాలు నిర్మిస్తూ...పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న టి చంద్రశేఖర్.. రెండేళ్ల క్రితం నమితను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులోని బనశంకరి సెకండ్ స్టేజ్‌లో వారు నివాసం ఉంటున్నారు. అయితే తన భార్య మత్తు పదార్థాలకు అలవాటు పడిందని. ఎన్నిసార్లు వద్దని వారించినా.. నిదానంగా చెప్పినా వినలేదన్నారు చంద్రశేఖర్. అంతే కాదు తనకు మత్తు పదార్థాల సరఫరా చేసే లక్ష్మీశ్ ప్రభుతో అక్కమ సబంధం పెట్టుకుందని. ఓసారి ఇంట్లో రెడ్ హ్యండెడ్‌గా ఇద్దరు దొరికిపోయారన్నారు చంద్రశేఖర్. మరి ఇదేంటంని ప్రశ్నించినప్పుడు తనపై దాడి చేశారన్నారు చంద్రశేఖర్.

కావాలనే నాపై ఆరోపణలు

కాగా తన భర్త తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చంద్రశేఖర్ భార్య నమిత కూడా తిరిగి కంప్లైంట్ ఇచ్చింది. లక్ష్మీశ్ తనకు స్నేహితుడు మాత్రమే నని. తన స్నేహితుడితో తన భర్త కావాలనే అక్రమ సంబంధం అంటగడుతున్నాడంటోంది నమిత. తన భర్త స్నేహితులు అరుణ్ , హేమంత్ ఇద్దరు తనపై దాడి చేశారని.. ఇంట్లో కావాలని వారే మత్తు పదార్థాలు పెట్టి నన్ను బెదిరిస్తున్నారంటోంది. పోలీస్టేషన్‌లో నమిత ఫిర్యాదు చేశారు . ఇక ఇరువైపులు.. కంప్లైంట్స్ తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు