నా మూర్ఖత్వమే ఆయన్ను సీఎం చేసింది...జితన్ పై నితీశ్ కుమార్ వివాదస్పద వ్యాఖ్యలు..!!

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాజీ సీఎం జితన్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కుల ఆధారిత సర్వే సరిగ్గా జరగలేదని భావిస్తున్నట్లు జితన్ చేసిన వ్యాఖ్యలపై నితీశ్ మండిపడ్డారు. నా మూర్ఖత్వమే ఆయన్ను ముఖ్యమంత్రి చేసిందని పేర్కొన్నారు.

New Update
నా మూర్ఖత్వమే ఆయన్ను సీఎం చేసింది...జితన్ పై నితీశ్ కుమార్ వివాదస్పద వ్యాఖ్యలు..!!

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి సభలో సహనం కోల్పోయి మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీపై మండిపడ్డారు. రిజర్వేషన్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా జితన్ రామ్ మాంఝీ తన అభిప్రాయాలను తెలియజేస్తుండగా నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ లెక్కన మాకు నమ్మకం లేదని, సరిగ్గా జరగలేదని జితన్ రామ్ మాంఝీ అన్నారు. పదేళ్లలో సమీక్షిస్తామని చెప్పారు, బీహార్ ప్రభుత్వం ఎప్పుడైనా సమీక్షించిందా? ఇప్పటి వరకు 16 శాతం రిజర్వేషన్లు ఉండాల్సి ఉండగా 3 శాతం మాత్రమే ఉంది. రిజర్వేషన్లు పెంచినా ఫర్వాలేదు కానీ క్షేత్రస్థాయిలో ఏముందని మాంఝీ అన్నారు.

జితన్ రామ్ మాంఝీ వ్యాఖ్యలపై సీఎం నితీశ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నా మూర్ఖత్వం వల్లే ఆయన సీఎం అయ్యారు.. ఆయనకు ఏమైనా జ్ఞానం ఉందా?' అంటూ ప్రశ్నించారు. మేం ఆయన్ను సీఎం చేశాం. ఆయన ఇప్పటికీ నేనే సీఎం అని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన కేవలం నా మూర్ఖత్వం వల్లే బీహార్ సీఎం అయ్యాడు అంటూ పరుష పదజాలంతో రియాక్ట్ అయ్యారు నితీశ్ కుమార్. దీంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆందోళనకు దిగారు.

ఓ బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ కుమార్ పై ఫైర్ అయ్యారు. సీఎంకు పిచ్చెక్కినట్లు ఉందని ఎమ్మెల్యే క్రిష్ణానందన్ పాశ్వాన్ అన్నారు. ఈ గందరగోళం మధ్యలో సమావేశాలు శుక్రవారం ఉదయం 11గంటలకు వాయిదా పడ్డాయి. జితిన్ రామ్ మాంఝీని అవమానకర భాషలో దూషించారు. ఈ తీరును మేము ఏమాత్రం ఉపేక్షించమని..సీఎం మానసిక స్థితి సరిగ్గా లేనట్లుంది..ఆయన చికిత్స చేయాలని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు.

కాగా షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), అత్యంత వెనుకబడిన తరగతులు (EBC) ఇతర వెనుకబడిన తరగతుల (OBC) రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుండి 65 శాతానికి పెంచే ప్రతిపాదనకు బీహార్ అసెంబ్లీ గురువారం ఆమోదం తెలిపింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ తరగతుల రిజర్వేషన్లను పెంచాలని ప్రతిపాదించిన బిల్లులను మూజువాణి ఓటు ద్వారా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ఎస్టీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను రెట్టింపు చేయగా, ఎస్సీలకు 16 శాతం నుంచి 20 శాతానికి పెంచనున్నారు. కాగా, ఈబీసీ రిజర్వేషన్లను 18 శాతం నుంచి 25 శాతానికి, ఓబీసీ రిజర్వేషన్లను 12 శాతం నుంచి 15 శాతానికి పెంచనున్నారు.

ఇది కూడా చదవండి: టికెట్ రాకపోవడంపై అద్దంకి సంచలన వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు